సమాచార సాగరం
మెరుపు వల్ల ప్రయోజనాలున్నాయా?
అసలు మెరుపంటేఎంటీ? మేఘాల్లొ  ఉన్న విద్యుత్ ఆవేశం  (charge) ఒక చోటునుండి  ఇంకొక  మేఘం  వైపుకో  లేక  భూమి(పిడుగు)వైపుకు గాలి  ద్వారా  ప్రయానించటాన్ని  మెరుప...
యాంటి బాక్టిరియల్ సబ్బు?
సబ్బుల్లొ  ఏ  యాంటి బాక్టిరియల్ సబ్బు  మంచిది. ఈ మద్య సబ్బు ల్లొ  TCC, ట్రై క్లొసాన్, లోహపు పొడులు  మొ|| ఉన్నాయంటూ  మీ  చర్మం  మీద ఉన్న బక్టీరియా ను, మీ చేత...
ఏ సబ్బు మంచిది ? (TFM అంటే ఏంటి?)
మీరు ఎప్పుడైన  సబ్బు  పెట్టె మీద TFM అనే  మాట  ను గమనించారా? TFM అంటే  TOTAL FATTY MATTER. అంటే  అందులో  ఎంత  ఆయిల్ వాడారు? అన్నమాట! TFM 80% మించి  ఎంత ఎక్కువ   ఉంటె అది  అంత  మ...
మేక పాల సబ్బులు ఎందుకు?
సబ్బుల్లొ ఏ సబ్బు మేలు? ఇప్పుడిప్పుడె సబ్బుల్లొ  గ్లిసరిన్ సబ్బులు మాయిఛ్హరైజింగ్ సబ్బులతొ పాటు విటమిన్ సబ్బులు, ప్రొటీన్ సబ్బులు, కెఫీన్ సబ్బుల...
అసిడిటి?
అసిడిటి/ కడుపు లొ  గాస్  కు వంట షొడా తో తక్షణ ఉశమనం ? మనం అనుకొంటం  కాని మన వంటింటి చిట్కాలు ఒక్కొసారి చాలా అద్బుతంగా పనిచేస్తాయి. నిజంగా అంతే !కడుపు ల...
విద్యుత్ తీగల పై వాలిన పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు?
మనం గమనిస్తుటాం కరెంటు తీగల పైన కుర్చున్న పక్షుల్ని. వాటిని గమనిస్తె, మనకనిపిస్తుంది అవి  ఒకే తీగ మీద కుర్చొని ఉండటం. మనము  కూడా  ఒకే తీగ మీద కూర్చొన...
పాల-పుంతల రకాలు?
ఒక్క పాల పుంతలో కొన్ని వందలకోట్ల నక్షత్రాలు ఉంటాయి. మన సూర్యుడు కూడా అలాంటి ఒక నక్షత్రమే. ఈ విశ్యంలో ఇలాంటి పాల పుంతలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి. మా...
వజ్రం?
ఆభరణాలలో అతి కరీదైన రాయి వజ్రం. అంతేకాదండి వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం. అంత పదునైనది మరి! ఇవి ఏలా వస్తాయి. ఏ రంగూ లేని వజ్రం లో పూర్తిగా కార్బన్ మాత్ర...
ఇంధనం?
మనం ఎక్కడికి  వెళ్ళాలన్నా ఏదో ఒక రూపంలో పెట్రోలు లేదా డిజిల్ ను వాడుతాం. వంట చేయాలంటే గ్యాస్ కావాలి. ఇవి ఎక్కన్నుంచి వస్తాయి? కొన్ని లక్షల సంవత్సరా...
కుండలో నీరు?
వేసవి కాలం లో ఎండలు మండిపోతుంటాయి. కానీ మన ఇంట్లొ ఉన్న కుండలోటి నీరు మాత్రం చల్లగా ఉంటాయి. ఎందుకిలా? మొదట కుండ యొక్క నిర్మాణం గూర్చి తెలుసుకొందాం. క...

జీ.పీ.యస్?

జీ.పీ.యస్ప్రస్తుతం లభించే ప్రతి మొబైల్ ఫోనులో ఈ సదుపాయం ఉంటుంది. అసలేంటిది? ఎందుకిది? ఎలా పని చేస్తుంది?

పూర్వికులు దారి తప్పిపోకుండా ఉండటానికి చాలా కష్ట పడేవారు. ఉదాహరణకి పెద్ద పెద్ద కట్టడాలు కట్టటం, నక్షత్రాల కదలికలు అబ్యసించటంలాంటివి. కానీ అప్పుడప్పుడూ తప్పిపోయేవారు.
కానీ ఈ కాలంలో జీ.పీ.యస్ పుణ్యమా అని ఇలాంటి కష్టాలేవీ లేవు. జీ.పీ.యస్ రిసీవర్ ఉన్న ఫోను చేతిలో ఉంటే చాలు మీరిక ఎన్నడూ తప్పిపోరు. ఈ జీపీయస్ మనం ఈ భూమ్మీద ఎక్కడున్నామో చూపుతుంది. ఎలా పని చేస్తుంది?
అమెరికా యొక్క మిలటరీ వారు నిత్యం భూమిని చుట్టే 27 ఉపగ్రహాలను వాటి వాటి రోదసులలోకి పంపారు. ఇవి రోజుకు రెండు సార్లు భూమిని చుడతాయి. 24 ఉపగ్రహాలు ఉన్నా సరిపోతాయి కానీ, ఏదైనా పని చేయకపోయే ప్రమాదముందని ముందు జాగ్రత్తగా మరో మూడు ఉపగ్రహాలను పంపారు. ముందు కేవలం అమెరికా మిలటరీ వారు మాత్రమే వాడే వారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంచారు. ఏ సమయములో నైనా వీటిలో నాలుగు మనకు కనిపించే ఆకాశం లో ఉన్నా మనమున్న స్థలాన్ని ఇట్టే చూపగలదు.
12000 మైళ్ళ ఎత్తులోగల రోదసిలో తిరుగుతున్న ఈ ఉపగ్రహాల బరువు దాదాపు 1500 నుండీ 2000 కిలోలు. వీటికి కావలసిన విద్యుత్ శక్తిని ఇవి సూర్యరస్మి ని వాడి తయారు చేసుకొంటాయి. మనం వాడే జీ.పీ.యస్ రిసీవర్ చేసే పని ఏమిటంటే, ఈ ఉపగ్రహాలకు ఇది ఎంత దూరములో ఉంది అని తెలుసుకొని తానున్న స్థలాన్ని నిర్దేసిస్తుంది.

మీరు మూడు ప్రాంతాలకు మద్యలో ఉన్నరు అని తెలుసు, కానీ ఎక్కడున్నారో తెలియదు. మీరు హైదరాబాదు నుండీ 200 కీ.మీ దూరంలో ఉన్నారని  ఒకతను మీకు చప్పగానే మీరు హైదరాబాదు చుట్టూ 200 కీ.మీ ల రేడియస్ తో గీసిన వృత్తం మీద ఉన్నరని అంచనా వేయవచ్చు. మరొకతను విజయవడ నుండి 300 కీ.మీ దూరం లో ఉన్నారని చెబితే మీరు విజయవడ చుట్టూ 200 కీ.మీ ల రేడియస్ తో గీసిన వృత్తం మీద ఉన్నరని అంచనా వేయవచ్చు. ఇద్దరు వ్యక్తులూ చెప్పిన సమాచారం ప్రకారం మీ స్థానం రెండు ప్రదేశాలలో ఒకటిగా అంచనా వేయాలి. మరొకతను మీరు కర్నూలుకు 200 కీ.మీ దూరం లో ఉన్నారని చెబితే మీరున్న ప్రదేశం స్పష్టంగా మూడు వృత్తలు కలిసిన చోటు అని తెలిసిపోతుంది.
కానీ ఉపగ్రహాలు, ఎత్తును కూడా పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకే నాలుగు ఉపగ్రహాలు అవసరం.
మన జీ.పీ.యస్ రిసీవర్ కు అది ఒకానొక ఉపగ్రహం నుండి ఇంత దూరం ఉంది అన్న విషయాన్ని ఆ ఉపగ్రహం ఎలా తెలుపుతుంది?
జీ.పీ.యస్ రిసీవర్ కు ఆ ఉపగ్రహం నుండీ సంకేతం కాంతి వేగం తో రావటానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయాన్ని బట్టి దాని దూరం కనుక్కోగలం.
అదండీ జీ.పీ.యస్ సంగతి.

కొత్త వ్యాఖ్య వ్రాయండి