ఎత్తైన భవనం కట్టడాల్లో అన్ని పెద్ద దేశాలూ పోటీ పడుతున్నాయి.
2010 జనవరి 4న దుబాయ్ లో తెరవబడ్డ బుర్జ్ ఖలీఫా ప్రస్థుతానికి అతి ఎత్తైన భవనం.
దీని ఎత్తు 828 మీటర్లు అంటే ఒక కిలో మీటరుకు 172 మీటర్లు తక్కువ.
మొదలు పెట్టిన ఆరు సంవత్సరాలలో పూర్తి చేసేశారు.
కట్టడానికైన కర్చు : 1500 కోట్ల డాలర్లు, అంటే దాదాపు 75000 కోట్ల రూపాయలు.
ఆఫీసులూ, హోటల్లు, అపార్టుమెంట్ లు కలిపి 160 అంతస్తులు, మరో 46 అంతస్తులు మైన్‌టెనెంస్ కు మాత్రమే.