మనం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూవుంటాము. కాని ఏ టూత్ పేస్ట్ వాడలో మాత్రం మనకు అంతగా తెలియదనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఒక సర్వే లో అన్నిటికన్నా ఎక్కువ అమ్ముడయ్యే తెల్ల కోల్గేట్ పేస్ట్ కేవలం దాని పిప్పరమెంట్ రుచి కోసమే కొంటున్నామన్న విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగించదా!!.
తెల్ల పేస్ట్ లలో క్యాల్సియం వుంటుంది. దీనివల్ల మన దంతాలపయిన ఒక పొర లాగ ఏర్పడి దంతాలు అరుగుదల విషయంలో కాస్త ఉపయోగం వుంటుంది. ఇక జెల్ పెస్ట్లు దంతాల పయిన గార ను అరగదీయడానికి ఉపయోగం. మరి ఫ్లోరైడ్? ఇది కూడా క్యాల్సియం పొర లాగ రక్షణ ఇస్తుంది. ఎప్పుడు? మనం తినే ఆహారం లో, తాగే నీటి లో ఫ్లోరయిడ్ తక్కువగా వుంటే. కాని మన రాష్ట్రం లో కోస్తా ప్రాంతం తప్ప మిగిలిన అన్నిచోట్ల ఫ్లోరయిడ్ ఎక్కువయి ఫ్లోరోసిస్ సమస్య ఉంది. దీని వలన మన దంతాలలో ఉండవలసిన మోతాదు కన్నా ఎక్కువే ఉంటోంది. మరీ మనకు ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అవసరమా? అంటే లేదనే చెప్పాలి. ఇంకో విషయం మనం చిన్న పిల్లలకు బ్రషింగ్ చేయించేటప్పుడు ఈ ఫ్లోరయిడ్ టూత్ పేస్ట్ తో మరీ జాగ్రత్త. పిల్లలు పేస్ట్ మింగి వేయటం వలన వాళ్ళకు ఫ్లోరోసిస్ వ్యాధికి సంభందించిన సమస్యలు అంటే దంతాలు గోధుమ రంగు సంతరించుకోవటం, ఎముకలు పెళుసుగా మారి సులువుగా విరగటం లాంటివి ఉత్పన్నమవుతాయి. సో ఈసారి పేస్ట్ కొనేటప్పుడు బాక్స్ మీద ఫ్లోరియిడ్ 1000ppm ,1500ppm గమనించండి.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
Thanks. టూత్ పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఎందుకు కలుపుతారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది.
mari sensitive tooth paste la gurinchi koodaa cheppivunte baaguntundhi