చాల మందికి రాత్రి పడుకొంటూనే ఓ పట్టాన నిద్ర పట్టదు. దీనికి చాల కారణాలు ఉండొచ్చు . కానీ నిద్రపోవటానికి ఒక చిన్న ఉపాయం (కిటుకు) ఉంది. సాదారణంగా మనం పడుకోనేటప్పుడు ఏవో ఒక ఆలోచనలతో వుంటాం. కాని ఆ ఆలోచనల్ని పక్కన పెట్టి నిద్ర పోవటం అనేది మన కంట్రోల్ లో వుండదు. అందుకే డాక్టర్లు ఇలా చేయమని చెప్పుతారు. ఇది చాల సులభమయిన మానసిక వ్యాయామం. అదేంటంటే వెనుక నుండి అంకెలని మనసులో లెక్కించటం. అంటే 1,2,3,…కాకుండా 4 ,3 ,2 ,1 …. ఇలా అన్నమాట. చాలామంది 99 , 98 , 97 .. నుండి మొదలెట్టి 3,2,1.. వచ్చేసరికి గుర్రు కొట్టేస్తుంటారు . మిగిలినవారు ఇంకాస్త పెద్ద సంఖ్య నుండి అంటే ఏ 400,399,388…నుండి మొదలెడితే సరిపోతుంది .ప్రశాంతంగా పడుకొని వేరే ఆలోచనలను దరి చేరకుండా 1000,999,989,… ఇలా మొదలెట్టి 1 వరకు లెక్క పెట్ట గలరేమో ప్రయత్నిచండి. ఇలా ఎందుకు జరుగుతుందంటే … మనం ప్రశాంతంగా పడుకొని వేరే ఆలోచనలు చేస్తుంటే మనస్సు వాటి మీద లగ్నం కావటం, పరిపరి విదాల పోవటం తో నిద్ర పట్టదు . కాని ఇలా అంకెలు లెక్కించటం వలన మన మనస్సు ఒకే అంశం మీద కేంద్రిక్రుతమయి క్రమంగా నిద్రలోకి జారు కొంటాము.