సమాచార సాగరం
దురదగుండాకు?
దురదగుండాకు అనే ఆకు పేరు విన్నారా! లేక తీట కోయిల/ తీట కందిరాకు! పేరేదయినా ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన ప...
వేడి చేయటం?
వేడి చేయటం అంటూ అసలు ఉందా ? ఏ డాక్టర్ ను అడిగిన దీనికి ఒకే సమాదానం . లేదు! మరి మనం ఇంతగా ... "నాకు వేడి చేసిందని" ," నాది వేడి శరీరమని" , వేడి చేసే ఆహారాలు , చలు...
క్యాలెండర్?
నిజానికి క్యాలెండర్ ఏ ఒకరో కనిపెట్టలేదు. దాదాపు 10000 ఏళ్ళ కిందట నైలు నది పరివహప్రాంతం లో ఈజిప్ట్ నాగరికత ఉచ్చ స్థాయి కి చేరుకొన్నది. వారికి నైలు నది...
సూపర్ మూన్ వస్తే?
సూపర్ మూన్! ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది . ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడనే విషయం మీకు తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడూ క్కాస్త దగ...
టూత్ పేస్ట్
మనం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూవుంటాము. కాని ఏ టూత్ పేస్ట్ వాడలో మాత్రం మనకు అంతగా తెలియదనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఒక సర్వే లో  అన్నిటికన్నా ఎక్...
కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గటం?
మీరు కడుపు నిండా తింటూ కూడా లావు మరియు బరువు తగ్గాలనుకుంటున్నారా ?! ఐతే మీరు కొన్ని రకాల ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి .పచ్చి  దోర ఆపిల్స్ , కీర దోస ...
చెట్లు – మూఢ నమ్మకాలు
బాగా నీరు ఉన్న చోట ఏపుగా పెరిగే వేప చెట్టుకు బెరడు పగుళ్ళు , ఆ పగుళ్ళలో ఎన్నో రకాల జీవులు, సుక్ష్మ జీవులు , శిలింద్రాలు , చిన్ని కీటకాలు  జీవిస్తూ ఉంటా...
విటమిన్స్ ఎక్కువ అయితే?
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా  పౌష్టికాహారం మీద జరిగిన  ఒక సర్వే లో విటమిన్ల లోపాల మీద కొన్ని విషయాలు తెలిసివచ్చాయి . మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి , వ...
త్వరగా నిద్ర పట్టాలంటే?
చాల మందికి రాత్రి పడుకొంటూనే ఓ పట్టాన నిద్ర పట్టదు. దీనికి చాల కారణాలు ఉండొచ్చు . కానీ నిద్రపోవటానికి ఒక చిన్న ఉపాయం (కిటుకు) ఉంది. సాదారణంగా మనం పడుక...
ఈగ?
ఈగలు భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసే చెరపు అంతా ఇంతా కాదు. ఎందుకిలా? అసలు ఈగే ఒక మహా చిరాకయినా జీవి. ఈగల  కాళ్ళకు సన్నని వెంట్రుకల వం...

దురదగుండాకు?

దురదగుండాకు అనే ఆకు పేరు విన్నారా! లేక తీట కోయిల/ తీట కందిరాకు! పేరేదయినా ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన పెరిగే ఓ పిచ్చి మొక్క. ఈ ఆకులు మన శరీరానికి తగిలితే అక్కడ విపరీతమయిన దురదలు పెడతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ ఆకుల్ని మైక్రోస్కోప్ తో పరీక్షిస్తే ఆకు పయిన సనసన్నని వెంట్రుకల్లాంటి సుదులుంటాయి. వీటి చివర్లో మనకు దురద  కలిగించే ఓ రసాయనం వుంటుంది.అది శరీరానికి తగిలితే దురద , దద్దుర్లు. ఇలా వుండటం వల్ల జంతువులూ, మానవుల నుండి ఆ మొక్కకు  రక్షణ వుంటుంది.  పల్లెల్లో శీతాకాలం లో   ఎక్కువ చలి లో ఆరుబయట తిరగాల్సి వస్తే  వేడి పుట్టించడానికి ఈ ఆకుల్ని నలిపి కాళ్ళకి , చేతులకి పట్టించటం ఒక కిటుకు.

వేడి చేయటం?

వేడి చేయటం అంటూ అసలు ఉందా ? ఏ డాక్టర్ ను అడిగిన దీనికి ఒకే సమాదానం . లేదు! మరి మనం ఇంతగా … “నాకు వేడి చేసిందని” ,” నాది వేడి శరీరమని” , వేడి చేసే ఆహారాలు , చలువ  చేసే ఆహారాలు, ఐస్ తింటే వేడి చేస్తుందని ఇలా రకరకాలుగా వింటుంటాం.నిజానికి ఇవన్నీ అపోహలంటే నమ్మబుద్ధి కాదు . ఎందుకంటే ఈ మాటలు మనల్ని నిజమని నమ్మేంతగా ప్రభావితం చేస్తున్నాయి. నిజానికి మన శరీరపు  ఉష్ణోగ్రత  37 C డిగ్రీలుగా (98.7 F ) ఒకే రీతిగా ఉంచబడుతుంది. మనం కాఫీ లాంటి వేడిగా ఉండేవి తీసుకొన్నప్పుడు చమట రూపంలో మన శరీరం చల్లపరచ బడుతుంది . ఇలాగా ఎప్పటికప్పుడు మన శరీరాన్ని చమట రూపం లో మరీ ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా చమట పోసి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక చలికాలం లోనయితే వనకడం ద్వార శరీరం వేడి పుట్టించి శరీర ఉష్ణోగ్రత ఒకేలా (37 C ) ఉంచుతుంది. మరి ఈ వేడి చేయటమేమిటి ? కొన్ని ఆరోగ్య సంభదమయిన సమస్యలే ఇవి! ఉదాహరణ కు మన శరీరం మీద  వేడి గుల్లలు (ఉడుకుగుల్లలు) అని చిన్న చిన్న పుండ్లు వస్తుంటాయి. ఇవి నిజానికి స్టెఫలోకోకాస్ అనే బాక్టీరియా వల్ల  వస్తాయి. కాని ఇవి వేడి చేయటం వలన వస్తాయని తరతరాలుగా ( అంటే బాక్టీరియా ను కనిపెట్టక ముందునుండి ) అపోహ . అలాగే మూత్రం పోసుకొనేటప్పుడు  మంటగా ఉండటం వేడి వల్లనే అని  అపోహ. కాని   మూత్రనాళం లో ఇన్ఫెక్షన్ వల్లనో లేక నీరు తక్కువ త్రాగటం వల్లనో వస్తుందని ఇప్పుడు తెలుసు. అలాగే కడుపులో అమీబియాసిస్ లాంటి వ్యాధులున్నప్పుడు అక్కడ ఎక్కువగా వేడి ఉత్పన్నమవుతుంది . అది చెమట రూపంలో బయట పడుతుంది.అంతేకాని నిజానికి వేడి చేయటం అంటూలేదు. అలాగే ఆహార పదార్థాల విషయం లో కూడా.

క్యాలెండర్?

నిజానికి క్యాలెండర్ ఏ ఒకరో కనిపెట్టలేదు. దాదాపు 10000 ఏళ్ళ కిందట నైలు నది పరివహప్రాంతం లో ఈజిప్ట్ నాగరికత ఉచ్చ స్థాయి కి చేరుకొన్నది. వారికి నైలు నదికి వరదలు ఎప్పుడు వస్తాయి, ఏ పంటలు వేసుకోవాలి ఇలాంటి అవసరాలు వారిని ఖగోళ పరిజ్ఞ్యననికి పురికొల్పింది . సుస్తిరమయిన పాలన, రక్షణ , ఆహారానికి కొరత లేకపోవటం వలన వారి మేధావులు కొన్ని వేల ఏండ్లు ఆకాశాన్ని పరిశీలించే అవకాశం కలిగింది. ఆ పరిజ్ఞ్యనాన్ని తరువాత తరాలకు అందిస్తూ రావటం తో క్రమంగా రోజును విభజించటం, వారాలు, నెలలు, సంవత్షరం ఇలా ఋతువులు విభజన చేయటం జరిగింది. తర్వాత అదే ఖగోళ పరిజ్ఞ్యనన్ని, సుమేరియన్లు, సింధు నాగరికులు వీరినుండి ఆర్యులు, చైనా వారు గ్రహించి వారి భౌగోళ పరిస్తితలకు అనుగుణంగా చంద్రమాన, సూర్యమాన క్యాలెండర్ లను తయారు చేసుకోవటం జరిగింది. మనం ఇప్పుడు వాడు తున్న క్యాలెండర్ రోమన్ల కాలం లో జూలియస్ సీజర్ (july) కాలం లో నుండి వచ్చింది. ఇక మన భారతీయ క్యాలెండర్ శాతవాహనుల శకం నుండి ప్రారంభమయినది.

సూపర్ మూన్ వస్తే?

Posted By: Gavesh on April 10, 2011 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, విశ్వం - Comments: 2 Comments »

సూపర్ మూన్! ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది . ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడనే విషయం మీకు తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడూ క్కాస్త దగ్గరగా కుడా  (అంటే మాములు  కన్నా) వస్తుంటాడు . ఓ  20000 – 30000 km . దీనివలన  ఏమవుతుంది ? నిజానికి  మార్చ్  19 న  మనకు  చందమామ  పైన  చెప్పినట్టుగా అతి దగ్గర  గా  వస్తాడు అని  శాస్త్రవేత్తల నుడివి. కాని  జపాన్  భూకంపం  మార్చ్  12 న సంభవిస్తే  ఏప్రిల్  మొదటి  వరం  లో  ఇండోనేశియ లో భూకంపం  వచ్చింది. ఆఫ్  కోర్స్  ఉత్తర  భారత  దేశం  లో  కూడా! సూపర్ మూన్  కు  ఈ  భూకంపాలకు  ఏమిటి  సంభందం? నిజానికి ఖగోళ  సంభంధమయిన  విషయాలు  కాస్త అటూ ఇటు గా జరుగుతుంటాయి. వాస్తవానికి  చంద్రుడు ఎంత దగ్గరగా వస్తాడో భూమి మీద చంద్రుడి  ఆకర్షణ అంత పెరుగుతుంది. దీని  వలన భూమి  పొరలలో  వత్తిడి  తగ్గి  పోతుంది . చంద్రుడు మాములు కన్నా  20000 కీ.మీ ల  దగ్గర   లో  వున్నాడా  లేక  21000 కీ.మీ ల దగ్గర   లో  వున్నాడా  అనేది  పెద్ద  లెక్క  లోకి  రాదు  . అందువల్లే  కొన్ని  రోజులు  అటు  ఇటుగా  భూకంపాలు  రావటం లేదా అగ్ని పర్వతాలు పేలటం జరుగుతుంటాయి. ఇలా  వత్తిడి పెరగటం లేదా తగ్గటం  వలన  కొన్ని  వేల   చదరపు  కిలో  మీటర్ల  రాతి  పొర   కాస్త  అంటే  కొన్ని  అడుగులు  (జపాన్  విషయం  లో  8 అడుగులు  మాత్రమే ! ) కిందికో , పైకో  ,పక్కకో జరుగుతాయి ! అంతేనండి. ప్రకృతి విలయం. కాబట్టి ఈసారి చంద్రుడు భూమికి దగ్గరగా  వస్తున్నాడంటే  కాస్త జాగ్రత్తండోయ్!!

టూత్ పేస్ట్

మనం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూవుంటాము. కాని ఏ టూత్ పేస్ట్ వాడలో మాత్రం మనకు అంతగా తెలియదనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఒక సర్వే లో  అన్నిటికన్నా ఎక్కువ అమ్ముడయ్యే తెల్ల  కోల్గేట్ పేస్ట్ కేవలం దాని పిప్పరమెంట్ రుచి కోసమే కొంటున్నామన్న విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగించదా!!.

తెల్ల పేస్ట్ లలో క్యాల్సియం వుంటుంది. దీనివల్ల మన దంతాలపయిన ఒక పొర లాగ ఏర్పడి దంతాలు అరుగుదల విషయంలో కాస్త ఉపయోగం వుంటుంది. ఇక జెల్ పెస్ట్లు దంతాల పయిన గార ను అరగదీయడానికి ఉపయోగం. మరి ఫ్లోరైడ్? ఇది కూడా క్యాల్సియం  పొర లాగ రక్షణ ఇస్తుంది. ఎప్పుడు? మనం తినే ఆహారం లో, తాగే నీటి లో ఫ్లోరయిడ్ తక్కువగా వుంటే. కాని మన రాష్ట్రం లో కోస్తా ప్రాంతం తప్ప మిగిలిన అన్నిచోట్ల  ఫ్లోరయిడ్ ఎక్కువయి ఫ్లోరోసిస్ సమస్య ఉంది. దీని వలన మన దంతాలలో ఉండవలసిన మోతాదు కన్నా ఎక్కువే ఉంటోంది. మరీ మనకు ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అవసరమా? అంటే లేదనే చెప్పాలి. ఇంకో విషయం మనం చిన్న పిల్లలకు బ్రషింగ్ చేయించేటప్పుడు ఈ ఫ్లోరయిడ్ టూత్ పేస్ట్ తో  మరీ జాగ్రత్త. పిల్లలు పేస్ట్ మింగి వేయటం వలన వాళ్ళకు ఫ్లోరోసిస్ వ్యాధికి సంభందించిన  సమస్యలు  అంటే దంతాలు గోధుమ రంగు సంతరించుకోవటం, ఎముకలు పెళుసుగా మారి సులువుగా విరగటం లాంటివి  ఉత్పన్నమవుతాయి. సో ఈసారి పేస్ట్ కొనేటప్పుడు బాక్స్ మీద  ఫ్లోరియిడ్ 1000ppm ,1500ppm గమనించండి.

కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గటం?

మీరు కడుపు నిండా తింటూ కూడా లావు మరియు బరువు తగ్గాలనుకుంటున్నారా ?! ఐతే మీరు కొన్ని రకాల ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి .పచ్చి  దోర ఆపిల్స్ , కీర దోస , ఉల్లి , దోర టమేటో , క్యారట్ , బీట్రూట్ , ముల్లంగి ,  క్యాబేజీ ,పచ్చి జామ, సిలేరి ,  ఆకుకూరలు (ఉడికినవి) లాంటి ఆహారాన్ని నెగటివ్ కేలోరి ఫుడ్స్  కోవలోకి వస్తాయి . ఇది ఎలా అంటే ఉదాహరణకు కిరదోస ముక్కల్ని ఒక కిలో తిన్నాము అనుకొందాం . ఇది మన కడుపులో జీర్ణం అయి మనకు నూరు కేలోరీల శక్తి ని ఇస్తుంది అని అనుకుందాం . కాని , ఈ కిలో ముక్కలని మనము నమిలి మింగడానికి దానిని జీర్ణం చేసుకోవడానికి 200 కేలోరీల శక్తి ఖర్చు అవుతుంది . మొత్తం మీద 100 కేలోరీల శక్తి మన శరీరం నుండి ఖర్చు అవుతుంది . ఇలాంటి ఆహారం తీసుకున్నపుడు మన కడుపు సుస్టు గా బొంచేసినట్లు తృప్తిగా ఉండడమే కాకుండా మనము ఇలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు బరువు కూడా తగ్గిపోతాము. కాబట్టి ముందు పేర్కొన్న ఇటంస్ మీ డైలీ మెనూలో చేర్చుకొని కడుపునిండా తిని కూడా బరువు తగ్గండి .

చెట్లు – మూఢ నమ్మకాలు

బాగా నీరు ఉన్న చోట ఏపుగా పెరిగే వేప చెట్టుకు బెరడు పగుళ్ళు , ఆ పగుళ్ళలో ఎన్నో రకాల జీవులు, సుక్ష్మ జీవులు , శిలింద్రాలు , చిన్ని కీటకాలు  జీవిస్తూ ఉంటాయి . ఇలాంటి పరిస్థితులలో వర్షం వచ్చిన , వత్తిడి ఏర్పడిన వేప చెట్టు నుండి తెల్లటి పాలలాంటి ద్రవం కారుతుంది . మాములుగా తాటి , ఈత , కొబ్బరి లాంటి చెట్ల నుండి కారే ద్రవం తెల్లగా ఉంటుంది (కల్లు) . ఈ వేప చెట్టు నుండి  మాములుగా  కారే ద్రవం అంత తెల్లగా ఉండదు . కాని పైన పేర్కొన్న పరిస్థితులలో ఐతే చిన్న చిన్న జీవులు ఉన్నపుడు వాటి గుడ్లు , లర్వాలు , శరీరాలు కలిసి తెల్లటి ద్రవం వస్తుంది . దీన్ని పాలు అని అనుకోవడం , ఆ చెట్టుకి మహత్యం ఉందని అనుకోవడం , ఆ చెట్టుకి పూజలు చేయడం  అశాస్త్రీయం.

విటమిన్స్ ఎక్కువ అయితే?

విటమిన్స్

ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా  పౌష్టికాహారం మీద జరిగిన  ఒక సర్వే లో విటమిన్ల లోపాల మీద కొన్ని విషయాలు తెలిసివచ్చాయి . మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి , వున్నత తరగతి  ప్రజలు అంటే అల్పాదాయ వర్గాల వారిని మినహాయిస్తే మిగిలిన వారిలో విటమిన్ల మీద అవగాహన బాగానే వుంది కాని ఇది కాస్త ఎక్కువయి హైపర్ విటమినోసిస్ కి దారితీస్తోందని తెలిసింది. ఈ మధ్య మన వాళ్ళు కూడా ముఖ్యంగా పిల్లల విషయంలో విటమిన్ మాత్రలు , విటమిన్ డ్రింక్స్ ,కంప్లన్-బూస్ట్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ ,విటమిన్ ఫుడ్స్ (ఈ మధ్య గోధుమ పిండి లో కూడా విటమిన్లు కలిపామని ప్రకటనలు), ఎక్కువగా వాడుతున్నారు . ఇవి  హైపర్ విటమినోసిస్ కి దారితీసి రకరకాల సమస్యలు సృస్టిస్చున్నాయి. ఈ విటమిన్లలో కొన్ని అంటే ఏ ,డీ, ఇ, విటమిన్ లు నీటిలో కరగవు.కాబట్టి వీటిని విసర్జించే అవకాశం లేదు . ఇవి శరీరం లో పేరుకొని పోవటం వలన తలనొప్పి, అలసట, నిస్తేజం , శరీరం పొడిగా వుండటం , దురద, చదువు మీద అనాసక్తి ఇలా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి . వీటి కోసం డాక్టర్ దగ్గరకు వెళితే మళ్లి విటమిన్  టాబ్లెట్స్ !! ప్రిస్క్రిబ్  చేస్తారు . మరీ చాల  ఎక్కువ స్తాయి లో సమస్యలొస్తే డాక్టర్లు హైపర్ విటమినోసిస్ గురించి ఆలోచిస్తారు. కాని ఈ సమస్యల్ని మనం ” కొని ” తెచ్చుకుంటున్నట్టు  డాక్టర్ గారికి తట్టాలిగా. ఇక నీటిలో కరిగే బి కాంప్లెక్స్ ,సి విటమిన్ లు తో పెద్ద ప్రమాదమేమి లేకపోయినా , ఎందుకంటే అవి మూత్రం ద్వారా (ఎక్కువయినవి) విసర్జింప బడతాయి ,ఎక్కువ కాలం ఎక్కువ మోతాదుల్లో తీసుకొంటూ వుంటే ప్రమాదమే! కాబట్టి జాగ్రత్త !!!

త్వరగా నిద్ర పట్టాలంటే?

నిద్ర

చాల మందికి రాత్రి పడుకొంటూనే ఓ పట్టాన నిద్ర పట్టదు. దీనికి చాల కారణాలు ఉండొచ్చు . కానీ నిద్రపోవటానికి ఒక చిన్న ఉపాయం (కిటుకు) ఉంది. సాదారణంగా మనం పడుకోనేటప్పుడు ఏవో ఒక ఆలోచనలతో వుంటాం. కాని ఆ ఆలోచనల్ని పక్కన పెట్టి నిద్ర పోవటం అనేది మన కంట్రోల్ లో వుండదు. అందుకే డాక్టర్లు ఇలా చేయమని చెప్పుతారు. ఇది చాల సులభమయిన మానసిక  వ్యాయామం. అదేంటంటే వెనుక నుండి అంకెలని మనసులో లెక్కించటం. అంటే 1,2,3,…కాకుండా 4 ,3 ,2 ,1 …. ఇలా అన్నమాట. చాలామంది   99 , 98 , 97 .. నుండి మొదలెట్టి 3,2,1.. వచ్చేసరికి గుర్రు కొట్టేస్తుంటారు . మిగిలినవారు ఇంకాస్త పెద్ద సంఖ్య నుండి అంటే ఏ 400,399,388…నుండి మొదలెడితే సరిపోతుంది .ప్రశాంతంగా పడుకొని వేరే  ఆలోచనలను దరి చేరకుండా   1000,999,989,… ఇలా మొదలెట్టి 1 వరకు లెక్క పెట్ట గలరేమో  ప్రయత్నిచండి. ఇలా  ఎందుకు జరుగుతుందంటే … మనం ప్రశాంతంగా పడుకొని వేరే ఆలోచనలు చేస్తుంటే మనస్సు వాటి మీద లగ్నం కావటం, పరిపరి విదాల పోవటం  తో నిద్ర పట్టదు . కాని ఇలా అంకెలు లెక్కించటం వలన మన మనస్సు ఒకే అంశం మీద కేంద్రిక్రుతమయి క్రమంగా నిద్రలోకి జారు కొంటాము.

ఈగ?

ఈగలు భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసే చెరపు అంతా ఇంతా కాదు. ఎందుకిలా? అసలు ఈగే ఒక మహా చిరాకయినా జీవి. ఈగల  కాళ్ళకు సన్నని వెంట్రుకల వంటివి వుంటాయి. దీని వలన అవి వాలిన ప్రతి పదార్థాన్ని   కాలికి రుద్దు కొని ఈ సన్నని వెంట్రుకల నిర్మాణం ద్వార ఆ పధార్తం రుచిని వాసనను తెలుసుకొంటాయి. కాళ్ళ ద్వార!! కాకపోతే వాలిన ప్రతిసారి తన కాళ్ళను ఇలా రుద్దుకోవటం వలన ఆ పదార్తాన్ని కాస్త తన కాళ్ళకు అంటించుకొని ఒక చోటినించి ఇంకొక చోటికి చేరవేస్తూ పోతుంది.  ఈక్రమంలో వ్యాధి  కారక క్రిములను తినుభండారాల పైకి చేర్చి రకరకాల అంటూ వ్యాధులను వ్యాపింప చేస్తాయి. కాబట్టి ఈగలు వాలిన పదార్థాన్ని తినికూడదని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తినుభండారాల పైన ఎప్పుడు మూత ఉంచాలని  డాక్టర్లు  సలహాలిస్తారు. ఈ సలహా పాటించి కలరా,టైఫాయిడ్ ,అమీబియాసిస్ ,డయోరియ,లాంటి వ్యాదుల్ని రాకుండా జాగ్రత్త పడదాం.