ఈగలు భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసే చెరపు అంతా ఇంతా కాదు. ఎందుకిలా? అసలు ఈగే ఒక మహా చిరాకయినా జీవి. ఈగల కాళ్ళకు సన్నని వెంట్రుకల వంటివి వుంటాయి. దీని వలన అవి వాలిన ప్రతి పదార్థాన్ని కాలికి రుద్దు కొని ఈ సన్నని వెంట్రుకల నిర్మాణం ద్వార ఆ పధార్తం రుచిని వాసనను తెలుసుకొంటాయి. కాళ్ళ ద్వార!! కాకపోతే వాలిన ప్రతిసారి తన కాళ్ళను ఇలా రుద్దుకోవటం వలన ఆ పదార్తాన్ని కాస్త తన కాళ్ళకు అంటించుకొని ఒక చోటినించి ఇంకొక చోటికి చేరవేస్తూ పోతుంది. ఈక్రమంలో వ్యాధి కారక క్రిములను తినుభండారాల పైకి చేర్చి రకరకాల అంటూ వ్యాధులను వ్యాపింప చేస్తాయి. కాబట్టి ఈగలు వాలిన పదార్థాన్ని తినికూడదని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తినుభండారాల పైన ఎప్పుడు మూత ఉంచాలని డాక్టర్లు సలహాలిస్తారు. ఈ సలహా పాటించి కలరా,టైఫాయిడ్ ,అమీబియాసిస్ ,డయోరియ,లాంటి వ్యాదుల్ని రాకుండా జాగ్రత్త పడదాం.
మనం గమనిస్తుటాం కరెంటు తీగల పైన కుర్చున్న పక్షుల్ని. వాటిని గమనిస్తె, మనకనిపిస్తుంది అవి ఒకే తీగ మీద కుర్చొని ఉండటం. మనము కూడా ఒకే తీగ మీద కూర్చొని ‘సారి’ వేలాడుతే మనకు షాక్కొట్టదు.ఎందుకు?
మీరు కరెంటు తీగల సంఖ్యను గమనించరా? వాటిలో ఒకటి సన్నాగా ఉండి సిరమిక్ గుభ్బ కు కాకుండ డైరెక్ట్ గా ఏ మెటల్ కో తగిలించి ఉంటుంది. అదే న్యూట్రల్ . మిగిలినవన్ని ’ఫెజ్’.
న్యూట్రల్ లో ఏ విదమైన కరెంట్ ఉండదు. మిగిలినవాటిలో ఎలక్త్రానులు ప్రవహిస్తూ ఉంటయి.
కాకపొతే ఏ రెండూ తీగల మధ్య అయినా పొటెంషియల్ తేడ ఉంటుంది. మనం ఒకే తీగ పట్టు కొంటె ఒకే పొటెన్షియల్ ఉంటుంది కబట్టి మన గుండా ఎలక్త్రాన్ లు ప్రవహించవు. కబట్టి షొక్ కొట్టదు. పక్షుల విషయం లొ కూడ అంతే. అవి ఎప్పుడు ఒకే తీగ మీద కూర్చుంటయి.అందువల్ల వాటికి షాక్ కొట్టదు. ఒకోసారి అవి తీగల మీద వాలెటప్పుడో లేక ఎగిరటప్పుడో రెండు తీగలకు తగిలి షాక్ కొట్టడం కద్దు.
మనం కూడా మన ఇంటిలొ ఎలక్త్రిషియన్ చెప్పులు వేసుకొని లేక ప్లాస్టిక్ చైర్ లేక చెక్క స్టూల్ మీద నిలబడి రిపైర్ చెయటం గమనించి ఉంటాం. ఎందుకంటె అవి మనగుండా ఎలక్త్రాన్ లు ప్రవహించకుండా అడ్డు కోవటం వల్ల మనము షాక్ కు గురి కాకుండా ఉండటనికి వీలవుతుంది.
కాబట్టి /అందువల్ల కరెంట్ తో జగ్రత్త్ సుమీ!
ఏ చేప అత్యంత వేగవంతం?
సెయిల్ చేప – గంటకు 110 కీ.మీ.
ఇవి ఇంత వేగంగా వెళ్ళగలవు కావున వీటిని వేటాడటానికి కొందరు పోటీలు పెడుతుంటారు. కానీ ఇలా వేటాడటం వల్ల గతంలో వీటి సంఖ్య క్రమంగా తగ్గసాగింది. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని, వీటిని పట్టిన వెంటనే వదిలేయసాగారు.
ఎలా ఉంటుంది?
ఈ చేప వీపు మీద ఒక పెద్ద రెక్క ఉంటుంది. దీనిని అవసరమైన సమయంలో మాత్రమే తెరుస్తుంది. గుంపుగా కలిసి చిన్న చేపలను ఈ రెక్కల సాయంతో భందించేసి వాటి పొడవాటి సూదైన ముక్కుతో వేటాడుతాయి. ఈ సమయములో రంగు కూడా మారుతాయని నిపుణులు చెబుతారు.
ఎక్కడుంటాయి?
పసిఫిక్ మరియూ అట్లాంటిక్ మహా సముద్రాలలో ఇవి నివసిస్తాయి. ఈదగలగటమే కాదండోయ్ ఎదుగుదల కూడా వేగమే.
వీటి గుడ్లు 36గంటల్లో పొదుగుతాయి. పుట్టిన చేప పిల్ల ఒక్క సంవత్సరంలో 6 అడుగులు పెరుగుతుంది. ఇవి పది అడుగుల పొడవుదాకా పెరుగుతాయి. కానీ బరువు 60 నుండి 70 కిలోలు మాత్రమే.