వేడి చేయటం అంటూ అసలు ఉందా ? ఏ డాక్టర్ ను అడిగిన దీనికి ఒకే సమాదానం . లేదు! మరి మనం ఇంతగా … “నాకు వేడి చేసిందని” ,” నాది వేడి శరీరమని” , వేడి చేసే ఆహారాలు , చలువ చేసే ఆహారాలు, ఐస్ తింటే వేడి చేస్తుందని ఇలా రకరకాలుగా వింటుంటాం.నిజానికి ఇవన్నీ అపోహలంటే నమ్మబుద్ధి కాదు . ఎందుకంటే ఈ మాటలు మనల్ని నిజమని నమ్మేంతగా ప్రభావితం చేస్తున్నాయి. నిజానికి మన శరీరపు ఉష్ణోగ్రత 37 C డిగ్రీలుగా (98.7 F ) ఒకే రీతిగా ఉంచబడుతుంది. మనం కాఫీ లాంటి వేడిగా ఉండేవి తీసుకొన్నప్పుడు చమట రూపంలో మన శరీరం చల్లపరచ బడుతుంది . ఇలాగా ఎప్పటికప్పుడు మన శరీరాన్ని చమట రూపం లో మరీ ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా చమట పోసి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక చలికాలం లోనయితే వనకడం ద్వార శరీరం వేడి పుట్టించి శరీర ఉష్ణోగ్రత ఒకేలా (37 C ) ఉంచుతుంది. మరి ఈ వేడి చేయటమేమిటి ? కొన్ని ఆరోగ్య సంభదమయిన సమస్యలే ఇవి! ఉదాహరణ కు మన శరీరం మీద వేడి గుల్లలు (ఉడుకుగుల్లలు) అని చిన్న చిన్న పుండ్లు వస్తుంటాయి. ఇవి నిజానికి స్టెఫలోకోకాస్ అనే బాక్టీరియా వల్ల వస్తాయి. కాని ఇవి వేడి చేయటం వలన వస్తాయని తరతరాలుగా ( అంటే బాక్టీరియా ను కనిపెట్టక ముందునుండి ) అపోహ . అలాగే మూత్రం పోసుకొనేటప్పుడు మంటగా ఉండటం వేడి వల్లనే అని అపోహ. కాని మూత్రనాళం లో ఇన్ఫెక్షన్ వల్లనో లేక నీరు తక్కువ త్రాగటం వల్లనో వస్తుందని ఇప్పుడు తెలుసు. అలాగే కడుపులో అమీబియాసిస్ లాంటి వ్యాధులున్నప్పుడు అక్కడ ఎక్కువగా వేడి ఉత్పన్నమవుతుంది . అది చెమట రూపంలో బయట పడుతుంది.అంతేకాని నిజానికి వేడి చేయటం అంటూలేదు. అలాగే ఆహార పదార్థాల విషయం లో కూడా.
మీరు కడుపు నిండా తింటూ కూడా లావు మరియు బరువు తగ్గాలనుకుంటున్నారా ?! ఐతే మీరు కొన్ని రకాల ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి .పచ్చి దోర ఆపిల్స్ , కీర దోస , ఉల్లి , దోర టమేటో , క్యారట్ , బీట్రూట్ , ముల్లంగి , క్యాబేజీ ,పచ్చి జామ, సిలేరి , ఆకుకూరలు (ఉడికినవి) లాంటి ఆహారాన్ని నెగటివ్ కేలోరి ఫుడ్స్ కోవలోకి వస్తాయి . ఇది ఎలా అంటే ఉదాహరణకు కిరదోస ముక్కల్ని ఒక కిలో తిన్నాము అనుకొందాం . ఇది మన కడుపులో జీర్ణం అయి మనకు నూరు కేలోరీల శక్తి ని ఇస్తుంది అని అనుకుందాం . కాని , ఈ కిలో ముక్కలని మనము నమిలి మింగడానికి దానిని జీర్ణం చేసుకోవడానికి 200 కేలోరీల శక్తి ఖర్చు అవుతుంది . మొత్తం మీద 100 కేలోరీల శక్తి మన శరీరం నుండి ఖర్చు అవుతుంది . ఇలాంటి ఆహారం తీసుకున్నపుడు మన కడుపు సుస్టు గా బొంచేసినట్లు తృప్తిగా ఉండడమే కాకుండా మనము ఇలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు బరువు కూడా తగ్గిపోతాము. కాబట్టి ముందు పేర్కొన్న ఇటంస్ మీ డైలీ మెనూలో చేర్చుకొని కడుపునిండా తిని కూడా బరువు తగ్గండి .
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహారం మీద జరిగిన ఒక సర్వే లో విటమిన్ల లోపాల మీద కొన్ని విషయాలు తెలిసివచ్చాయి . మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి , వున్నత తరగతి ప్రజలు అంటే అల్పాదాయ వర్గాల వారిని మినహాయిస్తే మిగిలిన వారిలో విటమిన్ల మీద అవగాహన బాగానే వుంది కాని ఇది కాస్త ఎక్కువయి హైపర్ విటమినోసిస్ కి దారితీస్తోందని తెలిసింది. ఈ మధ్య మన వాళ్ళు కూడా ముఖ్యంగా పిల్లల విషయంలో విటమిన్ మాత్రలు , విటమిన్ డ్రింక్స్ ,కంప్లన్-బూస్ట్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ ,విటమిన్ ఫుడ్స్ (ఈ మధ్య గోధుమ పిండి లో కూడా విటమిన్లు కలిపామని ప్రకటనలు), ఎక్కువగా వాడుతున్నారు . ఇవి హైపర్ విటమినోసిస్ కి దారితీసి రకరకాల సమస్యలు సృస్టిస్చున్నాయి. ఈ విటమిన్లలో కొన్ని అంటే ఏ ,డీ, ఇ, విటమిన్ లు నీటిలో కరగవు.కాబట్టి వీటిని విసర్జించే అవకాశం లేదు . ఇవి శరీరం లో పేరుకొని పోవటం వలన తలనొప్పి, అలసట, నిస్తేజం , శరీరం పొడిగా వుండటం , దురద, చదువు మీద అనాసక్తి ఇలా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి . వీటి కోసం డాక్టర్ దగ్గరకు వెళితే మళ్లి విటమిన్ టాబ్లెట్స్ !! ప్రిస్క్రిబ్ చేస్తారు . మరీ చాల ఎక్కువ స్తాయి లో సమస్యలొస్తే డాక్టర్లు హైపర్ విటమినోసిస్ గురించి ఆలోచిస్తారు. కాని ఈ సమస్యల్ని మనం ” కొని ” తెచ్చుకుంటున్నట్టు డాక్టర్ గారికి తట్టాలిగా. ఇక నీటిలో కరిగే బి కాంప్లెక్స్ ,సి విటమిన్ లు తో పెద్ద ప్రమాదమేమి లేకపోయినా , ఎందుకంటే అవి మూత్రం ద్వారా (ఎక్కువయినవి) విసర్జింప బడతాయి ,ఎక్కువ కాలం ఎక్కువ మోతాదుల్లో తీసుకొంటూ వుంటే ప్రమాదమే! కాబట్టి జాగ్రత్త !!!
ఈగలు భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసే చెరపు అంతా ఇంతా కాదు. ఎందుకిలా? అసలు ఈగే ఒక మహా చిరాకయినా జీవి. ఈగల కాళ్ళకు సన్నని వెంట్రుకల వంటివి వుంటాయి. దీని వలన అవి వాలిన ప్రతి పదార్థాన్ని కాలికి రుద్దు కొని ఈ సన్నని వెంట్రుకల నిర్మాణం ద్వార ఆ పధార్తం రుచిని వాసనను తెలుసుకొంటాయి. కాళ్ళ ద్వార!! కాకపోతే వాలిన ప్రతిసారి తన కాళ్ళను ఇలా రుద్దుకోవటం వలన ఆ పదార్తాన్ని కాస్త తన కాళ్ళకు అంటించుకొని ఒక చోటినించి ఇంకొక చోటికి చేరవేస్తూ పోతుంది. ఈక్రమంలో వ్యాధి కారక క్రిములను తినుభండారాల పైకి చేర్చి రకరకాల అంటూ వ్యాధులను వ్యాపింప చేస్తాయి. కాబట్టి ఈగలు వాలిన పదార్థాన్ని తినికూడదని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తినుభండారాల పైన ఎప్పుడు మూత ఉంచాలని డాక్టర్లు సలహాలిస్తారు. ఈ సలహా పాటించి కలరా,టైఫాయిడ్ ,అమీబియాసిస్ ,డయోరియ,లాంటి వ్యాదుల్ని రాకుండా జాగ్రత్త పడదాం.
సబ్బుల్లొ ఏ యాంటి బాక్టిరియల్ సబ్బు మంచిది.
ఈ మద్య సబ్బు ల్లొ TCC, ట్రై క్లొసాన్, లోహపు పొడులు మొ|| ఉన్నాయంటూ మీ చర్మం మీద ఉన్న బక్టీరియా ను, మీ చేతుల్లొని హానికారక సూక్ష్మజీవులను క్షణాల్లొ చంపి రోజంతా రక్షిస్తామని ఊదరగొట్టేస్తున్నారు.నిజానికి ఆ సబ్బులకు అంత సీన్ ఉందా? లైఫ్‌బాయ్, సింతాల్, డెట్టాల్ ఇలా చాలానే ప్రకటనలు వస్తున్నయ్.TCC ఉన్న సబ్బులు వాడితే సూక్ష్మజీవుల సంగతి ఎలా ఉన్నా చిన్నపిల్లల్లొ వెన్నుసమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు.అందువల్ల చిన్నపిల్లల విషయం లొ జగ్రత్త గా సబ్బును ఎంచుకోండి. ఇక చేతులు కడుక్కోవటానికి పై సబ్బులు బాగానే ఉపయోగపడతాయి. ఇక చలికాలం కన్న ఎండాకాలం చర్మం మీద సూక్ష్మక్రిముల పెరుగుదల ఎక్కువ. కాబట్టి పై సబ్బులు ఉపయోగం గా ఉంటాయి. ఈ మద్యనె లొహపు పొడులతో చేసిన సబ్బులు మర్కెట్ లొ వస్తూన్నయి. వీటిల్లొ రాగి(copper) వెండి (silver), alluminium, bismath, nickel మొదలయిన లోహల్ని అతి సూక్ష్మంగా పొడి చెసి సబ్బుల్లొ కలుపుతారు. ఈ పొడి బక్టీరియా,వైరస్ లాంటి సూక్ష్మక్రిముల్ని నిర్ములించటమే కాకుండా చర్మనికి అంటిపెట్టుకొని చాలా గంటల పాటు వాటి పెరుగుదలని అరికడుతుంది.