సమాచార సాగరం
దురదగుండాకు?
దురదగుండాకు అనే ఆకు పేరు విన్నారా! లేక తీట కోయిల/ తీట కందిరాకు! పేరేదయినా ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన ప...
వేడి చేయటం?
వేడి చేయటం అంటూ అసలు ఉందా ? ఏ డాక్టర్ ను అడిగిన దీనికి ఒకే సమాదానం . లేదు! మరి మనం ఇంతగా ... "నాకు వేడి చేసిందని" ," నాది వేడి శరీరమని" , వేడి చేసే ఆహారాలు , చలు...
క్యాలెండర్?
నిజానికి క్యాలెండర్ ఏ ఒకరో కనిపెట్టలేదు. దాదాపు 10000 ఏళ్ళ కిందట నైలు నది పరివహప్రాంతం లో ఈజిప్ట్ నాగరికత ఉచ్చ స్థాయి కి చేరుకొన్నది. వారికి నైలు నది...
సూపర్ మూన్ వస్తే?
సూపర్ మూన్! ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది . ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడనే విషయం మీకు తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడూ క్కాస్త దగ...
టూత్ పేస్ట్
మనం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూవుంటాము. కాని ఏ టూత్ పేస్ట్ వాడలో మాత్రం మనకు అంతగా తెలియదనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఒక సర్వే లో  అన్నిటికన్నా ఎక్...
కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గటం?
మీరు కడుపు నిండా తింటూ కూడా లావు మరియు బరువు తగ్గాలనుకుంటున్నారా ?! ఐతే మీరు కొన్ని రకాల ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి .పచ్చి  దోర ఆపిల్స్ , కీర దోస ...
చెట్లు – మూఢ నమ్మకాలు
బాగా నీరు ఉన్న చోట ఏపుగా పెరిగే వేప చెట్టుకు బెరడు పగుళ్ళు , ఆ పగుళ్ళలో ఎన్నో రకాల జీవులు, సుక్ష్మ జీవులు , శిలింద్రాలు , చిన్ని కీటకాలు  జీవిస్తూ ఉంటా...
విటమిన్స్ ఎక్కువ అయితే?
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా  పౌష్టికాహారం మీద జరిగిన  ఒక సర్వే లో విటమిన్ల లోపాల మీద కొన్ని విషయాలు తెలిసివచ్చాయి . మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి , వ...
త్వరగా నిద్ర పట్టాలంటే?
చాల మందికి రాత్రి పడుకొంటూనే ఓ పట్టాన నిద్ర పట్టదు. దీనికి చాల కారణాలు ఉండొచ్చు . కానీ నిద్రపోవటానికి ఒక చిన్న ఉపాయం (కిటుకు) ఉంది. సాదారణంగా మనం పడుక...
ఈగ?
ఈగలు భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసే చెరపు అంతా ఇంతా కాదు. ఎందుకిలా? అసలు ఈగే ఒక మహా చిరాకయినా జీవి. ఈగల  కాళ్ళకు సన్నని వెంట్రుకల వం...

ఎర్ర లైట్ ఎందుకు?

ఎర్ర లైట్ కు ఉన్న ప్రత్యేక లక్షణాల కారణంగా  స్టాప్ సిగ్నల్ గా  ఎక్కువగా వాడతారు.మామూలు తెల్లని కాంతి లో అన్ని అంటే ఏడు వర్ణాలు ఉంటాయి. వాటిలో ఒక్క ఎర్ర రంగు కే ఎక్కువ తరంగ ధైర్గం (వేవ్ లెంగ్త్ ), తక్కువ పరిక్షేపన ఉండటం వల్ల ఎక్కువ దూరం వరకు కనిపిస్తుంది. బాగా పొగ మంచు ఉన్నప్పుడు మరియు రాత్రి వేళల్లో  కూడా ఎక్కువ దూరం ఒక్క ఎర్ర రంగు తో  మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్లనే వాహనాల్లో వెనుక ట్రాఫిక్ మరియు రైల్వే సిగ్నల్స్ నిలుపు అనే అర్థం లో వాడతారు. అంతే కాని  రక్తం ఎరుపు  రంగులో ఉంటుంది కాబట్టి  స్టాప్ సిగ్నల్ గా ఎరుపు రంగు వాడతారు అనుకోవద్దు.

కుములో నింబస్ మేఘాలు

Posted By: Gavesh on December 8, 2010 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, భూగోలం - Comments: No Comments »

మనకు ఒక్కోసారి ఆకాశం లో నల్లటి దట్టమయిన మేఘాలు వర్షం వచ్చేలా కనిపిస్తుంటాయి. ఉన్నంట్లుంది భారీ వర్షం కురుస్తుంది. ఆకాశం లో 5 కి. మీ. ల నుండి 10 కి.మీ. ల ఎత్తు వరకు  వ్యాపించిన నల్లని దట్టమయిన మేఘాలనే కుములో నింబస్ మేఘాలని  అంటారు. వీటిగుండ విమానాలు వెళ్ళితే పైలెట్లు విమానం మీద పట్టు కోల్పోతారు. సమాచార సంభంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఎటు వేల్లుతున్నమో తెలియక ప్రమాదపు అంచుల వరకు  వెళ్ళిన సందర్భాలు చాల ఉన్నాయి. అందుకే ఇవి విమానం నడిపే వారికీ పీడకల లాంటివి. మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై. యస్. గారి హెలికాప్టర్  కూడా ఇలాంటి మేగాల వల్లే ప్రమాదమదానికి గురయినదని చెప్పవచ్చు.

చంద్రుని చుట్టూ వలయాలు?

మీరెప్పుడైన అలా మంచి వెన్నెల రాత్రి చంద్రుడి వైపు చూస్తే ఒక్కో సారి చంద్రుడి చుట్టూ ఒక వలయం లేక హలో కనబడుతుంది. ఇలా ఎందుకంటే వాతావరణం లో మంచు స్పటికాలు ఉంటే, అంటే వాతావరణం లో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ మంచు స్పటికాల ద్వార కాంతి  పరివర్తనం మరియు వక్రీభవనం  చెందితే ఇలాంటి పరిస్తితి ఏర్పడుతుంది. ఇలాంటి వలయాలు ఒక రకంగావర్ష సూచన. ఇలా ఏర్పడినప్పుడు వర్షం అక్కడే కానీ లేకే దూరం గా కాని (ఓ 10 లేక 15 కి. మీ. ల అవతల కాని) పడే అవకాసం ఉంది. కాకపోతే వలయం దగ్గర గా ఉంటే వర్షం దూరంగా వలయం దూరం గా ఉంటె వర్షం దగ్గరగా పడుతుందని ఒక నమ్మకం. కాకపొతే సిటీ లలో  ఉన్నవారికి చంద్రుడిని చూసే అవకాశం ఉందంటారా? ఈ సారి రాత్రి  బయటికి వెళ్లేముందు ఒక్కసారి గమనించి బయలుదేరండి.

దక్షిణ భారత దేశం లో భూకంపాలు రావా?

Posted By: Gavesh on December 7, 2010 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, భూగోలం - Comments: 1 Comment »

భూకంపంఒక విధం గా దక్షిణ భారతీయులు ఈ విషయం లో అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే దక్షిన భారత దేశం లోని 4 రాష్ట్రాల్లో మనం భూకంపాల భయం లేకుండా ఇల్లు కట్టు కొంటాం. ఇలా ఎందుకు? నిజానికి దక్షిణ భారత పీటభూమి ఒకే పళ్ళెం లాంటి నిర్మాణం అంటే దాదాపు ఒకే రాయి గా ఉంటుంది, అందువల్ల ఈ భాగం లో పగుళ్ళు వచ్చి భూమి కంపించటానికి అవకాశాలు చాలా తక్కువ. నిజానికి ఇలాంటి పగుల్ల వల్లే భూకంపాలు వస్తాయి. ఉతర భారత దేశం లో, హిమాలయ ప్రాంతం లో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు మనకు చిన్నగా భూమి కంపిస్తుంది. అంతే తప్ప మనకు పెద్ద భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద డ్యాం ల వల్ల కూడా భూకంపాలు వస్తున్నాయి. కొయిన డ్యాం వల్ల మహారాష్ట్ర లో, నాగార్జున సాగర్ ,శ్రీశైలం ల వలన హైదరాబాద్ లో చిన్న చిన్న భూకంపాలు వస్తున్నాయి.

మెరుపు వల్ల ప్రయోజనాలున్నాయా?

Posted By: Gavesh on March 13, 2010 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, భూగోలం - Comments: No Comments »


అసలు మెరుపంటేఎంటీ? మేఘాల్లొ  ఉన్న విద్యుత్ ఆవేశం  (charge) ఒక చోటునుండి  ఇంకొక  మేఘం  వైపుకో  లేక  భూమి(పిడుగు)వైపుకు గాలి  ద్వారా  ప్రయానించటాన్ని  మెరుపు  అంటారు.  మెరుపు ఈ  విధంగా  ప్రయనించటానికి  చాలా  శక్తి  కావాలి. అలా ప్రయానించేటప్పుడు  గాలి  లోని  నత్రజని (Nitrogen) ఆంలజని(Oxygen) తోచర్య  జరిపి   వాన  నీటి  తో  కలిసి  యూరియా  గా  ఎర్పడుతాయి. ఒక్కొ మెరుపు కొన్ని టన్నుల   యూరియా  ను   ఉత్పత్తి  చేస్తుంది. ఒక  మనిషి  తన జీవిత కాలం లొ  ఒక మెరుపంత  కూడా  యూరియా  కూడా  తయారు  చెయ్యలేడు (యూరిన్  రూపం లొ). కాబట్టి  ప్రకౄతి  లొ   మన విలువ ఒక మెరుపు  కన్న తక్కువే! అంతే కాదండోయ్!చెట్లు  ఆహారాన్ని  (కిరనజన్యససన్యోగక్రియ photosynthasis) చెసుకోవడానికి  కూడా  అంతే ఉపయోగ పడతాయి. ఇంకో విషయమేమిటంటే  మెరుపులు  ఉరుములుగా  మార్చి నుండి  జూన్  వరకు  ఎక్కువగా  భూమి వైపు  వస్తాయి.కాబట్టి  మిగతా  నెలల్లో  ధైర్యంగా  ఉండడి మన మీద పిడుగు పడటానికి అవకాశాలు  తక్కువ!

యాంటి బాక్టిరియల్ సబ్బు?

సబ్బుల్లొ  ఏ  యాంటి బాక్టిరియల్ సబ్బు  మంచిది.
ఈ మద్య సబ్బు ల్లొ  TCC, ట్రై క్లొసాన్, లోహపు పొడులు  మొ|| ఉన్నాయంటూ  మీ  చర్మం  మీద ఉన్న బక్టీరియా ను, మీ చేతుల్లొని హానికారక సూక్ష్మజీవులను క్షణాల్లొ చంపి  రోజంతా రక్షిస్తామని  ఊదరగొట్టేస్తున్నారు.నిజానికి  ఆ సబ్బులకు అంత సీన్ ఉందా? లైఫ్‌బాయ్, సింతాల్, డెట్టాల్  ఇలా చాలానే  ప్రకటనలు వస్తున్నయ్.TCC ఉన్న సబ్బులు వాడితే సూక్ష్మజీవుల సంగతి ఎలా ఉన్నా చిన్నపిల్లల్లొ  వెన్నుసమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు.అందువల్ల చిన్నపిల్లల విషయం లొ జగ్రత్త  గా  సబ్బును ఎంచుకోండి. ఇక  చేతులు కడుక్కోవటానికి   పై సబ్బులు  బాగానే  ఉపయోగపడతాయి. ఇక చలికాలం కన్న  ఎండాకాలం చర్మం  మీద  సూక్ష్మక్రిముల  పెరుగుదల  ఎక్కువ. కాబట్టి  పై సబ్బులు  ఉపయోగం గా  ఉంటాయి. ఈ మద్యనె లొహపు పొడులతో  చేసిన సబ్బులు మర్కెట్  లొ వస్తూన్నయి. వీటిల్లొ  రాగి(copper) వెండి (silver),  alluminium, bismath, nickel మొదలయిన లోహల్ని  అతి సూక్ష్మంగా  పొడి చెసి  సబ్బుల్లొ  కలుపుతారు. ఈ పొడి  బక్టీరియా,వైరస్ లాంటి  సూక్ష్మక్రిముల్ని  నిర్ములించటమే కాకుండా చర్మనికి అంటిపెట్టుకొని  చాలా గంటల పాటు వాటి పెరుగుదలని అరికడుతుంది.

ఏ సబ్బు మంచిది ? (TFM అంటే ఏంటి?)


మీరు ఎప్పుడైన  సబ్బు  పెట్టె మీద TFM అనే  మాట  ను గమనించారా? TFM అంటే  TOTAL FATTY MATTER. అంటే  అందులో  ఎంత  ఆయిల్ వాడారు? అన్నమాట! TFM 80% మించి  ఎంత ఎక్కువ   ఉంటె అది  అంత  మంచి సబ్బు !(GRADEI)TFM 65%-80% (GRADEII)వరకు  ఉంటే  O.K. అన్నమాట. అంతకన్నా తక్కువ  ఉంటే  అది  TOILET SOEP గా పరిగని౦చబడదు. మనం వాడే  దాదాపు  అన్ని సబ్బుల్లొ  డిటర్జెంట్  కలుపుతున్నారు. TFM 80% కంటే  ఎక్కువ ఉన్న సబ్బు ల్లొ   డిటర్జెంట్   % అతి తక్కువగా  ఉండే అవకాశం  ఉంది . TFM ఎక్కువ  అంటే ఎక్కువ మన్నిక మరియు  మంచిది కూడా!నిజం ఎమిటంటే  సబ్బు తయారీ లొ  బట్టల సో డా  మరియు నూనె లు వాడతారు. సబ్బు తయారైన తర్వాత ఎంత  ఎక్కువ గా  సోడా  సబ్బు లొ మిగిలిపోతె  అది అంత  తక్కువ  నాణ్యత గలది  అన్నమాట. ఇలాంటి  తక్కువ  నాణ్యత  గల  సబ్బులు  వాడటం  వలన  మన చర్మం  తెల్లగా  పొడిబారి  నట్లు  ఉంటుంది.ఇది చలికాలం  లో  మరింత  ఎక్కువ. అందుకె చలికలం లో  మనం గ్లిజరిన్ మరియు మాయుచ్హరైజింగ్ సబ్బులు వాడవలసిన అవసరం వస్తోంది. ఈసారి సబ్బు  కొనేటప్పుడు  పై  అంశాలను  గుర్తుంచుకోండి.

మేక పాల సబ్బులు ఎందుకు?

సబ్బుల్లొ ఏ సబ్బు మేలు?
ఇప్పుడిప్పుడె సబ్బుల్లొ  గ్లిసరిన్ సబ్బులు మాయిఛ్హరైజింగ్ సబ్బులతొ పాటు విటమిన్ సబ్బులు, ప్రొటీన్ సబ్బులు, కెఫీన్ సబ్బులు, SUNSCREEN సబ్బులు వస్తున్నయ్. మరి మేక పాల సబ్బులేంటి అంటారా?
గ్లిసరిన్ మరియు మాయిచ్హరైజింగ్ సబ్బులు చర్మన్ని పొడిబారనియకుండా ఉంచడానికి
, విటమిన్ సబ్బులు మన శరీరంలొ  విటమిన్లు  పూరించటనికి -
ప్రొటీన్ సబ్బులు మన చర్మంలొ  ప్రొటీన్ లను పూరించటానికి .
కెఫీన్ సబ్బులు  స్నానం తర్వాత ఫ్రెష్  గా  ఉండటానికి.
SUNSCREEN సబ్బులు  మన చర్మం ఎండ లొ  నల్లబడకుండా  ఉండటానికి.
ఇంకో విషమండొయ్ మన చర్మం విటమిన్ లను  ప్రొటీన్ లను కెఫీన్ ను పీల్చుకుంటుందనటానికి శాస్ర్తీయంగా సమాదానాల్లేవ్!
మరి మేక పాల సబ్బులు ? ఇవి మొటిమలు మరియు చిన్న చిన్న  మచ్హలు,(ACNE) లాంటి వాటికి మందులాగ పనిచేస్తుందని మేకపాల సబ్బులు తయారు చేసి మరి  మన మీదికి వదులుతున్నారు.
ఇంత క్రితం గంగా జలం సబ్బులు వచ్హాయి .(సబ్బు తయారి లొ నీరు వాడరు).అలాగే ఇదీనూ!ఇది కూడా శాస్త్రీయంగా ఎక్కడా నిరుపించబడలేదు.

అసిడిటి?

అసిడిటి/ కడుపు లొ  గాస్  కు వంట షొడా తో తక్షణ ఉశమనం ?
మనం అనుకొంటం  కాని మన వంటింటి చిట్కాలు ఒక్కొసారి చాలా అద్బుతంగా పనిచేస్తాయి. నిజంగా అంతే !కడుపు లో గుడగుడ ,మంట  గొంతు వరకు ప్రాకుతుంది . ఆంటసిడ్!మెడికల్ స్టొర్! డాక్టర్!ఇంత  అవసరమా? కానీ ఇంట్ళో  సులభంగా దొరికే వంట షొడా తొ మూడు  నిమిషాల్లొ  ఉపశమనం పొందవచ్చు.ఒక పావు టీ  స్పూను లేక అర టీ స్పూను  వంట షొడా  ఓ అర గ్లాస్ నీటిలొ  కలిపి  కొద్ది కొద్ది గా  సిప్  చేయటమే!ఎందుకంటారా? సింపిల్  కెమిస్ట్రి !base nutralises acid ఆమ్లాన్ని  క్షారం  విరిచేయటం  వలన.కాని  జగ్రత్తండొయ్ B.P.ఉన్నవాళ్లకు వంట షోడ    సమస్యలున్నయ్. ఈసారి ఎప్పుడయినా  మంచి  బిరియాని  లాగించిన తర్వతా  లేక ఏ దోశలో  లాగించిన తర్వాత  కడుపులో  మంట, గొంతులొ మంట, గాస్ ! సింపిల్, ఓ  పావు టీ స్పూలేక అర టీ స్పూన్  వంట షొడ తో  ఉపశమనం(రోజు కు 2 టీ స్పూన్ లకు మించకుండ).

విద్యుత్ తీగల పై వాలిన పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు?

మనం గమనిస్తుటాం కరెంటు తీగల పైన కుర్చున్న పక్షుల్ని. వాటిని గమనిస్తె, మనకనిపిస్తుంది అవి  ఒకే తీగ మీద కుర్చొని ఉండటం. మనము  కూడా  ఒకే తీగ మీద కూర్చొని ‘సారి’  వేలాడుతే మనకు షాక్కొట్టదు.ఎందుకు?

 మీరు కరెంటు తీగల  సంఖ్యను గమనించరా? వాటిలో ఒకటి సన్నాగా ఉండి సిరమిక్ గుభ్బ కు కాకుండ డైరెక్ట్ గా ఏ మెటల్ కో తగిలించి  ఉంటుంది. అదే న్యూట్రల్ . మిగిలినవన్ని ’ఫెజ్’.

న్యూట్రల్ లో ఏ విదమైన కరెంట్ ఉండదు. మిగిలినవాటిలో ఎలక్త్రానులు ప్రవహిస్తూ ఉంటయి.

కాకపొతే  ఏ రెండూ తీగల మధ్య అయినా పొటెంషియల్ తేడ ఉంటుంది.  మనం ఒకే తీగ పట్టు కొంటె  ఒకే పొటెన్షియల్ ఉంటుంది కబట్టి  మన గుండా  ఎలక్త్రాన్ లు ప్రవహించవు. కబట్టి  షొక్ కొట్టదు. పక్షుల విషయం లొ కూడ  అంతే. అవి ఎప్పుడు ఒకే తీగ మీద కూర్చుంటయి.అందువల్ల వాటికి షాక్ కొట్టదు. ఒకోసారి అవి తీగల మీద వాలెటప్పుడో లేక ఎగిరటప్పుడో రెండు తీగలకు తగిలి షాక్ కొట్టడం కద్దు.

మనం కూడా మన ఇంటిలొ ఎలక్త్రిషియన్ చెప్పులు వేసుకొని లేక ప్లాస్టిక్  చైర్ లేక చెక్క స్టూల్ మీద నిలబడి రిపైర్ చెయటం గమనించి ఉంటాం. ఎందుకంటె  అవి మనగుండా ఎలక్త్రాన్ లు ప్రవహించకుండా అడ్డు కోవటం వల్ల మనము షాక్ కు గురి కాకుండా ఉండటనికి వీలవుతుంది.

కాబట్టి /అందువల్ల  కరెంట్ తో జగ్రత్త్ సుమీ!