
ఒక్క పాల పుంతలో కొన్ని వందలకోట్ల నక్షత్రాలు ఉంటాయి. మన సూర్యుడు కూడా అలాంటి ఒక నక్షత్రమే. ఈ విశ్యంలో ఇలాంటి పాల పుంతలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి. మానవునికి తెలిసినంతలో ఈ పాల-పుంతల రకాలు నాలుగు.
1. స్పైరల్ : ఒక సుడి లాగా ఉంటాయి. వాటి చుట్టు అవి తిరుగుతూ ఉంటాయి.

2. బార్డ్ స్పైరల్ : పొడవుగా ఉండి, కొనల్లో సుడిలాగా మారుతాయి.

3. ఎలిప్టికల్ : పళ్ళెం లేదా గుడ్డు లేదా బంతి ఆకారంలో ఉంటాయి ఇవి.

ఆభరణాలలో అతి కరీదైన రాయి వజ్రం. అంతేకాదండి వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం. అంత పదునైనది మరి!
ఇవి ఏలా వస్తాయి.
ఏ రంగూ లేని వజ్రం లో పూర్తిగా కార్బన్ మాత్రమే ఉంటుంది. వేరే పదార్థం ఏదైనా కలిస్తేనే దానికి వేర్వేరు రంగులు వస్తాయి.
కింబర్లైట్ అనే రాయిలో చాలా శాతం కార్బన్ ఉంటుంది. ఇది దాదాపు భూమి ఉపరితలం నుంటి 150 కీ.మీ లోతులో ఉంటుంది. ఆ ఒత్తిడికీ మరియూ వేడికీ ఈ రాయి వజ్రం లాగా మారుతుంది. అగ్ని పర్వతాల ద్వారా లేదా మట్టి క్రమంగా పైకి రావటం ద్వారనో ఈ వజ్రాలు కూడా పైకి వస్తాయి.
వజ్రం తయారవటానికి కావలసిన ఉష్నోగ్రత, 1500 డిగ్రీల సెల్సియస్. ఒత్తిడి 70 వేళ అట్మాస్ఫియర్లు.
మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక రూపంలో పెట్రోలు లేదా డిజిల్ ను వాడుతాం. వంట చేయాలంటే గ్యాస్ కావాలి.
ఇవి ఎక్కన్నుంచి వస్తాయి?
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చిన్న చిన్న మొక్కలు మరియూ చెట్లు సముద్రం అడుగున సూక్ష్మ జీవుల తో పాటుగా బురదలో కూరుకు పోయాయి. ఇవి అపారమైన ఉష్నోగ్రత మరియూ ఒత్తిడికి లోనయ్యాయి, ఈ సంధర్భంలో ఆ క్రిములు చేసిన రసాయనిక చర్యల వల్ల ఇందనం ఏర్పడింది.
దీనిని వెలికి తీసిన తరువాత, పెట్రోలు డిజలు మరియూ మరెన్నో రకాలైన ఇందనాలను కర్మాగారాల్లో వేరు చేస్తారు.
వేసవి కాలం లో ఎండలు మండిపోతుంటాయి. కానీ మన ఇంట్లొ ఉన్న కుండలోటి నీరు మాత్రం చల్లగా ఉంటాయి. ఎందుకిలా?
మొదట కుండ యొక్క నిర్మాణం గూర్చి తెలుసుకొందాం. కుండలు తయారు చేసే మట్టిని ముందు నీటిలో కలిపి కుండ ఆకారంలో దన్ని మలిచి అగ్గిలో కాలుస్తారు. ఈ క్రమంలో అందులో ఉన్న నీరు అంతా ఆవిరైపోతుంది. కానీ ఆ నీరు ఉన్న ప్రదేశంలో ఖాలీలు ఉండిపోతాయి.
కుండలో నీరు పోయగానే, ఈ ఖాళీ లలో నీరు మెల్లగా నిండుతుంది. ఇలా జరగటం వల్ల నీరు ఎంత ఎత్తైతే ఉంటాయో అంతవరకు కుండ తడిగా అవుతుంది.
కుండలోటి నీటి ఒత్తిడి బయటకు ఉంటుంది. ఆ నీరు రంద్రాలలో నుంటి బయటకు వస్తుంది. అక్కన్నుంచి మరి ఎక్కడికెళ్ళగలదు? ఆ కుండ గోడలలో ఉన్న వేడిని వాడుకొని అది ఆవిరైపోతుంది. ఇలా కుండ యొక్క ఉష్నోగ్రత క్రమంగా తగ్గిపోతుంది, అలానే అందులోటి నీటి ఉష్నోగ్రత మరియూ ఆ నీటి ఎత్తు కూడా తగ్గుతుంది.
అదే ఒక బట్ట దానికి చుడితే ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
గమనించాల్సిన విషయాలు.
పుట్టిన వాడు గిట్టక తప్పదు. అంటే చావు అనివార్యం అని అర్థం.
కానీ చావు అంటే అర్థం ఏమిటి? ప్రాణులు ఎందుకు చనిపోతాయి?
చచ్చిపోవటం అంటే శాశ్వతంగా నిద్రపోవటం కాదు. మన శరీరం లో ఏదైనా ముఖ్యమైన భాగం పని చేయకపోతే అది పూర్తి స్థాయిలో పనిచేయలేదు. ఇలాంటి పరిస్థితి తీవ్రం అయ్యినపుడు పూర్తిగా మానేస్తుంది. దీనినే చనిపోవటం అంటాం.
ఇలాంటి అవయవాలలో ముఖ్యమైనవి, గుండె మరియూ మెదడు.
ముసలి వారిలో చాలా వరకు అవయవాలు క్షీనించి పోయి ఉంటాయి. కొన్నాల్లకు వీటిలో ఏదైనా ఒకటి ఆగిపోతే ఆ వ్యక్తి చనిపోతారు. ఇలా జరగటానికి కేవళం వయస్సు మాత్రమే కారణం కాదు, తీవ్ర గాయలైనా లేదా ప్రమాదకరం ఐన జబ్బు చేసినా కానీ ఈ పరిస్థితి సంభవించవచ్చు.
ఒక వ్యక్తి గుండె, వారి పిడికిలి అంత ఉంటుంది.
రక్త ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎరుపు రంగులో ఉంటుంది. కానీ లావుగా ఉన్న వారిలో కొవ్వు అధికంగా ఉండటం మూలాన ఇది పసుపు రంగులో ఉంటుంది.
గుండె ఎడమ వైపు ఉండదు, ఆస్చర్యపోకండి, మనిషి గుండె రెండు ఓపిరితిత్తుల మద్యలో, చాతి మద్య భాగంలో ఉంటుంది. కాస్త ఎడమవైపుకు ఒరిగి ఉంటుంది అంతే.
అసలు గుండె ఏం చేస్తుంది?
మనిషి శరీరం లో ప్రతి అవయవానికీ ప్రాణ వాయువు మరియూ పని చేయటానికి శక్తి అవసరం. మన శరీరంలోని రక్తం ప్రాణవాయువును ఊపిరితిత్తులలో కరిగించుకొని మరియూ మనం తిన్న ఆహారం నుంటీ వేర్వేరు ఫోషకాలనీ తీసుకొంటుంది. ఈ రక్తాన్ని శరీరమంతా ప్రవహింపజేస్తుంది మన గుండె.
రక్తానికి, గుండె నుంటి కాలి బొటన వేళుకు వెళ్ళి మళ్ళి తిరిగి గుండె కు చేరుకోవటానికి 10 క్షణాలు పడుతుంది.
దాదాపు రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది మన గుండె. అంటే మనిషి జీవితంలో అందాసుగా 250 కోట్ల సార్లు.
ఈ పదం వినని వారు మన రాష్ట్రం లో ఉండరు.
సాధారణంగా వచ్చే అలలు వేగమైన సముద్రపు గాలుల వళ్ళ సృష్టించబడుతాయి.
కానీ సునామీలు మాత్రం సముద్రపు అడుగు కదలినపుడు మాత్రమే వస్తాయి. ఇలా జరగటానికి భూకంపం ఐనా రావాలి లేదా సముద్రపు అడుగులో అగ్ని పర్వతమైనా పేలాలి.
అలా జరిగన ప్రదేశం నుంటీ అన్ని వైపులా ఈ సునామీ వస్తుంది. ఎలాగైతే నీటిలో రాయి విసిరినప్పుడు అలలు వస్తాయో అలాగన్న మాట.
వీటి ఎత్తు కొన్ని సందర్బాలలో 100 అడుగులు కూడా ఉండే అవకాశం ఉంది. వీటి వల్ల ఓడలకి ప్రమాదం ఎమీ ఉండదు. ఎందుకంటే అవి ఉన్న ప్రదేశం లో, సముద్రం 100 అడుగులకంటే లోతు ఉంటుంది. అందుకే ఈ సునామీ, నీటి మట్టం కంటే క్రిందనుంటి వెళ్ళిపోతుంది. కానీ దీని నిజ స్వరూపం వొడ్డుకు వచ్చేదాకా తెలియదు.
గంటకు 300 మైళ్ళ వేగం తో కనీసం 20 అడుగుల ఎత్తు మరియూ దాదాపు ఒక కిలో మీటరు పొడవున్న నీటి గోడ తాకితే ఆ పరిస్తితి ఎంత విషమంగా ఉంటుందో ఊహించండి. ఇలా ఒక్క అల వచ్చి ఆగిపోదు. వెంట వెంటనే 5 లేదా 6 అలలు వస్తాయి.
ఇప్పటిదాకా 12 మంది రాష్ట్రపతులు మన దేశం లో ఎన్నుకోబడ్డారు. మరో ముగ్గరు తాత్కాలిక రాష్ట్రపతులుగా ఉన్నారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పరిపాలించారో తెలుసుకొందాం.
| 1. | డా. రాజేంద్ర ప్రసాద్ | - | జనవరి 26, 1950 | - | మే 13, 1962 వరకు. |
| 2. | డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ | - | మే 13, 1962 | - | మే 13, 1967 వరకు. |
| 3. | డా.జాకీర్ హుస్సేన్ | - | మే 13, 1967 | - | మే 3, 1969 వరకు. |
| 4. | వరాహగిరి వేంకటగిరి | - | మే 3, 1969 | - | జూలై 20, 1969 వరకు. (తాత్కాలికం). |
| 5. | ఎం.హిదయతుల్లా | - | జూలై 20, 1969 | - | ఆగష్టు 24, 1969 వరకు. (తాత్కాలికం). |
| 6. | వరాహగిరి వేంకటగిరి | - | ఆగష్టు 24, 1969 | - | ఆగష్టు 24, 1974 వరకు. |
| 7. | ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ | - | ఆగష్టు 24, 1974 | - | ఫిబ్రవరి 11, 1977 వరకు. |
| 8. | బి.డి.జట్టి | - | ఫిబ్రవరి 11, 1977 | - | జూలై 25, 1977 వరకు. (తాత్కాలికం). |
| 9. | నీలం సంజీవరెడ్డి | - | జూలై 25, 1977 | - | జూలై 25, 1982 వరకు. |
| 10. | జ్ఞాని జైల్ సింగ్ | - | జూలై 25, 1982 | - | జూలై 25, 1987 వరకు. |
| 11. | ఆర్.వెంకటరామన్ | - | జూలై 25, 1987 | - | జూలై 25, 1992 వరకు. |
| 12. | డా.శంకర దయాళ్ శర్మ | - | జూలై 25, 1992 | - | జూలై 25, 1997 వరకు. |
| 13. | కె.ఆర్.నారాయణన్ | - | జూలై 25, 1997 | - | జూలై 25, 2002 వరకు. |
| 14. | డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ | - | జూలై 25, 2002 | - | జూలై 25, 2007 వరకు. |
| 15. | ప్రతిభా పాటిల్ | - | జూలై 25, 2007 | - | ……………….. |
క్రింద తెలిపే విషయాలన్నీ కేవళం ఙానం కోసం మాత్రమే.
సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూఉంటాం, హీరో లేదా విలన్ తుపాకీతో కాలుస్తే, ముందుకేదో వెల్లి అవతలి వ్యక్తికి తగులుతుంది(అది విలనైనా కావచ్చు, లేదా హీరోని కాపాడటానికి అడ్డొచ్చిన హీరోయిన్ ఐనా కావచ్చు). కానీ, ఇంకేదో బులెట్టంతటిది, పొగలొస్తూ తుపాకీ నుండి బయటకు పడిపోతుంది, ఏంటది??
బులెట్ లో మనం గమనించవలసినవి భాగాలు 5 ఉంటాయి.
1.గుండు.
2.కవచం(గొట్టం).
3.పేలుడు పదార్థం.
4. కవచానికి మూత.
5. పేలుడుకు సహకరించే పదార్థం.
తుపాకీ యొక్క ట్రిగ్గరు లాగిన వెంటనే గుర్రం ( తుపాకీలో బులెట్టుకు తగిలే భాగం ), బులెట్టు యొక్క వెనుక భాగంలో ఉన్న పేలుడుకు సహకరించే పదార్థానికి తగులుతుంది. దీపావళికి వాడే తుపాకీలో వాడే రసాయనం లాంటిదే ఇది, అందుకే గట్టిగా గుర్రం తగలగానే ఇది మండుతుంది. దీని ధాటికి బొమ్మలో చూపినట్టుగా మూడవ భాగంలో ఉన్న రసాయనం పేలితుంది. ఆ పధార్థమంతా పేలి వాయువు రూపంలోకి మారి గుండును ముందుకు తోస్తుంది. బొమ్మలో చూపినవిదంగా 2 మరియూ 4 భాగాలు కెవలం మందునూ, గుండునూ వాటి స్థానాల్లో నిలపటానికి మాత్రమే. బులెట్టు పేలిన వెంటనే ఇవి తుపాకీ పై బాగంలో ఉన్న ఖాళీ ద్వారా బయటక్కొచ్చేస్తాయి.
బులెట్టు సామర్థ్యాన్ని బట్టి దాని వేగం ఉంటింది. సెకనుకు 180మీటర్ల నుండీ 1500మీటర్ల వేగంతో వెలువడుతుంది. అంటే శక్తివంతమైన బులెట్లు ఒక్క సెకెనులో ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయానిస్తుంది. తుపాకీ నుండీ బయటకు ఈ వేగంతో వస్తుంది కానీ, పోను పోనూ దాని వేగం తగ్గిపోతుంది.
బ్రష్ చేయటానికి సరైన పద్దతి ఏది?
సరిగ్గా బ్రష్ చేయటానికి కేవలం రెండు నిమిషాలు పడుతుంది. కానీ చాలామంది ఈ కాస్త సమాయాన్ని కూడా కేటాయించరు. కావాలంటే మీరు బ్రష్ చేసే సమయాన్ని కొలిచి చూడండి. చిన్నపాటి మరియూ నెమ్మదైన కదలికలతో, చిగుళ్ళకూ అలాగే కష్టం మీద చేరగలిగే దవడ పళ్ళకూ మరింత ప్రాదాన్యత ఇస్తూ బ్రష్ చేయాలి.
బ్రష్షు మరియూ పేస్టు ఎలాంటివై ఉండాలి?
చాలామంది డెంటిస్టులు soft-bristles ఉన్న బ్రష్షుని వాడమని సలహా ఇస్తారు. చిన్నటి హెడ్(Bristles ఉన్న ప్రాంతం) ఐతే, కష్టంగా అందుకోవాల్సిన ప్రాంతాలకు కూడా చేరుకోగలదు. 2-3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి. ఒక వేళ అరుగుదల అంతకన్నా ముందే కనిపిస్తే అప్పుడే మార్చేయాలి.
నిజానికి పేస్టు వాడవలసిన అవసరం లేదు, కాకపోతే మనం అలవాటుపడిపోయాం కాబట్టి సోడాపొడీ ఉప్పూ యొక్క మిశ్రమం సరిపోయినా వాటిని వాడలేం. అందువలనే ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి, ఏలా వాడాలన్నది వ్రాస్తున్నాను.
కాల్షియంతో కూడినది (సాధారనంగా ఇలాంటివి తెల్లగా ఉంటాయి) వాడటంవల్ల పళ్ళకు రక్షణ ఉంటుంది. ఇలాంటి పేస్టును మొదటగా బ్రష్షు సాయంతో పంటి యొక్క నమిలే వైపు (పై పంటికి క్రింద, క్రింది పంటికి పై వైపు) రాయాలి.
పళ్ళ సందుల్లోకి బ్రష్షు బ్రిసల్స్ తో శుబ్రపరచాలి.

1. పై పళ్ళ వెలుపలి వైపు అలాగే క్రింది పళ్ళ వెలుపలి వైపూ శుబ్రపరచండి.
2. పై పళ్ళ లోపలి వైపు అలాగే క్రింది పళ్ళ లోపలి వైపూ శుబ్రపరచండి.
3. దవడ పళ్ళను శుబ్రపరచండి.
4. శ్వాస ధుర్గందబరితంగా లేకుండా ఉండటానికి, నాలుకపై శుబ్రపరచటం మరువకండి. టంగ్ క్లీనర్ వాడటం మంచిది కాదు, ఎందువలనంటే, నాలుక మొద్దుబారిపోయి సులభంగా రుచులను గుర్తించలేదు, కావున బ్రష్ తో నాలుకను శుబ్రపరచండి.
ఇక్కడ స్వయంగా మీరే బ్రష్ చేయటం పరిక్షించవచ్చు.
చాలా రకముల టూత్ పేస్ట్ లలో 1000 p.p.mల నుండీ 1500 p.p.mల వరకూ ఫ్లోరైడ్ ఉంటుంది. మన రాష్ట్రంలో డెల్టా ప్రాంతాల్లో( నీటి పారుదల పుష్కలంగా ఉన్న కోస్తా ప్రాంతాలు ) తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో నీళ్ళల్లోనే ఫ్లోరైడ్ తగినంత ఉంటుంది. కొన్ని జిల్లాల్లో( అనంతపురం, నల్గొండ మొ॥) మరీ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ టూత్ పేస్టు ఫ్లోరోసిస్ వ్యాధిని అధికం చేస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లు ఇలాంటి పేస్టు మింగడం మరీ ప్రమాదం. కావున మీరు ఈసారి పేస్టు కొనేటప్పుడు ఫ్లోరైడు లేని (Non-fluoridated) మరియూ కాల్షియం ఉన్న టూత్ పేస్టును చూసి కొనండి.