సమాచార సాగరం
దురదగుండాకు?
దురదగుండాకు అనే ఆకు పేరు విన్నారా! లేక తీట కోయిల/ తీట కందిరాకు! పేరేదయినా ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన ప...
వేడి చేయటం?
వేడి చేయటం అంటూ అసలు ఉందా ? ఏ డాక్టర్ ను అడిగిన దీనికి ఒకే సమాదానం . లేదు! మరి మనం ఇంతగా ... "నాకు వేడి చేసిందని" ," నాది వేడి శరీరమని" , వేడి చేసే ఆహారాలు , చలు...
క్యాలెండర్?
నిజానికి క్యాలెండర్ ఏ ఒకరో కనిపెట్టలేదు. దాదాపు 10000 ఏళ్ళ కిందట నైలు నది పరివహప్రాంతం లో ఈజిప్ట్ నాగరికత ఉచ్చ స్థాయి కి చేరుకొన్నది. వారికి నైలు నది...
సూపర్ మూన్ వస్తే?
సూపర్ మూన్! ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది . ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడనే విషయం మీకు తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడూ క్కాస్త దగ...
టూత్ పేస్ట్
మనం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూవుంటాము. కాని ఏ టూత్ పేస్ట్ వాడలో మాత్రం మనకు అంతగా తెలియదనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఒక సర్వే లో  అన్నిటికన్నా ఎక్...
కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గటం?
మీరు కడుపు నిండా తింటూ కూడా లావు మరియు బరువు తగ్గాలనుకుంటున్నారా ?! ఐతే మీరు కొన్ని రకాల ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి .పచ్చి  దోర ఆపిల్స్ , కీర దోస ...
చెట్లు – మూఢ నమ్మకాలు
బాగా నీరు ఉన్న చోట ఏపుగా పెరిగే వేప చెట్టుకు బెరడు పగుళ్ళు , ఆ పగుళ్ళలో ఎన్నో రకాల జీవులు, సుక్ష్మ జీవులు , శిలింద్రాలు , చిన్ని కీటకాలు  జీవిస్తూ ఉంటా...
విటమిన్స్ ఎక్కువ అయితే?
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా  పౌష్టికాహారం మీద జరిగిన  ఒక సర్వే లో విటమిన్ల లోపాల మీద కొన్ని విషయాలు తెలిసివచ్చాయి . మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి , వ...
త్వరగా నిద్ర పట్టాలంటే?
చాల మందికి రాత్రి పడుకొంటూనే ఓ పట్టాన నిద్ర పట్టదు. దీనికి చాల కారణాలు ఉండొచ్చు . కానీ నిద్రపోవటానికి ఒక చిన్న ఉపాయం (కిటుకు) ఉంది. సాదారణంగా మనం పడుక...
ఈగ?
ఈగలు భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసే చెరపు అంతా ఇంతా కాదు. ఎందుకిలా? అసలు ఈగే ఒక మహా చిరాకయినా జీవి. ఈగల  కాళ్ళకు సన్నని వెంట్రుకల వం...

ఎర్ర లైట్ ఎందుకు?

ఎర్ర లైట్ కు ఉన్న ప్రత్యేక లక్షణాల కారణంగా  స్టాప్ సిగ్నల్ గా  ఎక్కువగా వాడతారు.మామూలు తెల్లని కాంతి లో అన్ని అంటే ఏడు వర్ణాలు ఉంటాయి. వాటిలో ఒక్క ఎర్ర రంగు కే ఎక్కువ తరంగ ధైర్గం (వేవ్ లెంగ్త్ ), తక్కువ పరిక్షేపన ఉండటం వల్ల ఎక్కువ దూరం వరకు కనిపిస్తుంది. బాగా పొగ మంచు ఉన్నప్పుడు మరియు రాత్రి వేళల్లో  కూడా ఎక్కువ దూరం ఒక్క ఎర్ర రంగు తో  మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్లనే వాహనాల్లో వెనుక ట్రాఫిక్ మరియు రైల్వే సిగ్నల్స్ నిలుపు అనే అర్థం లో వాడతారు. అంతే కాని  రక్తం ఎరుపు  రంగులో ఉంటుంది కాబట్టి  స్టాప్ సిగ్నల్ గా ఎరుపు రంగు వాడతారు అనుకోవద్దు.

బులెట్?

క్రింద తెలిపే విషయాలన్నీ కేవళం ఙానం కోసం మాత్రమే.

సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూఉంటాం, హీరో లేదా విలన్ తుపాకీతో కాలుస్తే, ముందుకేదో వెల్లి అవతలి వ్యక్తికి తగులుతుంది(అది విలనైనా కావచ్చు, లేదా హీరోని కాపాడటానికి అడ్డొచ్చిన హీరోయిన్ ఐనా కావచ్చు). కానీ, ఇంకేదో బులెట్టంతటిది, పొగలొస్తూ తుపాకీ నుండి బయటకు పడిపోతుంది, ఏంటది??

బులెట్ లో మనం గమనించవలసినవి భాగాలు 5 ఉంటాయి.

1.గుండు.

2.కవచం(గొట్టం).

3.పేలుడు పదార్థం.

4. కవచానికి మూత.

5. పేలుడుకు సహకరించే పదార్థం.

తుపాకీ యొక్క ట్రిగ్గరు లాగిన వెంటనే గుర్రం ( తుపాకీలో బులెట్టుకు తగిలే భాగం ), బులెట్టు యొక్క వెనుక భాగంలో ఉన్న పేలుడుకు సహకరించే పదార్థానికి తగులుతుంది. దీపావళికి వాడే తుపాకీలో వాడే రసాయనం లాంటిదే ఇది, అందుకే గట్టిగా గుర్రం తగలగానే ఇది మండుతుంది. దీని ధాటికి బొమ్మలో చూపినట్టుగా మూడవ భాగంలో ఉన్న రసాయనం పేలితుంది. ఆ పధార్థమంతా పేలి వాయువు రూపంలోకి మారి గుండును ముందుకు తోస్తుంది. బొమ్మలో చూపినవిదంగా 2 మరియూ 4 భాగాలు కెవలం మందునూ, గుండునూ వాటి స్థానాల్లో నిలపటానికి మాత్రమే. బులెట్టు పేలిన వెంటనే ఇవి తుపాకీ పై బాగంలో ఉన్న ఖాళీ ద్వారా బయటక్కొచ్చేస్తాయి.

బులెట్టు సామర్థ్యాన్ని బట్టి దాని వేగం ఉంటింది. సెకనుకు 180మీటర్ల నుండీ 1500మీటర్ల వేగంతో వెలువడుతుంది. అంటే శక్తివంతమైన బులెట్లు ఒక్క సెకెనులో ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయానిస్తుంది. తుపాకీ నుండీ బయటకు ఈ వేగంతో వస్తుంది కానీ, పోను పోనూ దాని వేగం తగ్గిపోతుంది.

లa

జీ.పీ.యస్?

జీ.పీ.యస్ప్రస్తుతం లభించే ప్రతి మొబైల్ ఫోనులో ఈ సదుపాయం ఉంటుంది. అసలేంటిది? ఎందుకిది? ఎలా పని చేస్తుంది?

పూర్వికులు దారి తప్పిపోకుండా ఉండటానికి చాలా కష్ట పడేవారు. ఉదాహరణకి పెద్ద పెద్ద కట్టడాలు కట్టటం, నక్షత్రాల కదలికలు అబ్యసించటంలాంటివి. కానీ అప్పుడప్పుడూ తప్పిపోయేవారు.
కానీ ఈ కాలంలో జీ.పీ.యస్ పుణ్యమా అని ఇలాంటి కష్టాలేవీ లేవు. జీ.పీ.యస్ రిసీవర్ ఉన్న ఫోను చేతిలో ఉంటే చాలు మీరిక ఎన్నడూ తప్పిపోరు. ఈ జీపీయస్ మనం ఈ భూమ్మీద ఎక్కడున్నామో చూపుతుంది. ఎలా పని చేస్తుంది?
అమెరికా యొక్క మిలటరీ వారు నిత్యం భూమిని చుట్టే 27 ఉపగ్రహాలను వాటి వాటి రోదసులలోకి పంపారు. ఇవి రోజుకు రెండు సార్లు భూమిని చుడతాయి. 24 ఉపగ్రహాలు ఉన్నా సరిపోతాయి కానీ, ఏదైనా పని చేయకపోయే ప్రమాదముందని ముందు జాగ్రత్తగా మరో మూడు ఉపగ్రహాలను పంపారు. ముందు కేవలం అమెరికా మిలటరీ వారు మాత్రమే వాడే వారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంచారు. ఏ సమయములో నైనా వీటిలో నాలుగు మనకు కనిపించే ఆకాశం లో ఉన్నా మనమున్న స్థలాన్ని ఇట్టే చూపగలదు.
12000 మైళ్ళ ఎత్తులోగల రోదసిలో తిరుగుతున్న ఈ ఉపగ్రహాల బరువు దాదాపు 1500 నుండీ 2000 కిలోలు. వీటికి కావలసిన విద్యుత్ శక్తిని ఇవి సూర్యరస్మి ని వాడి తయారు చేసుకొంటాయి. మనం వాడే జీ.పీ.యస్ రిసీవర్ చేసే పని ఏమిటంటే, ఈ ఉపగ్రహాలకు ఇది ఎంత దూరములో ఉంది అని తెలుసుకొని తానున్న స్థలాన్ని నిర్దేసిస్తుంది.

మీరు మూడు ప్రాంతాలకు మద్యలో ఉన్నరు అని తెలుసు, కానీ ఎక్కడున్నారో తెలియదు. మీరు హైదరాబాదు నుండీ 200 కీ.మీ దూరంలో ఉన్నారని  ఒకతను మీకు చప్పగానే మీరు హైదరాబాదు చుట్టూ 200 కీ.మీ ల రేడియస్ తో గీసిన వృత్తం మీద ఉన్నరని అంచనా వేయవచ్చు. మరొకతను విజయవడ నుండి 300 కీ.మీ దూరం లో ఉన్నారని చెబితే మీరు విజయవడ చుట్టూ 200 కీ.మీ ల రేడియస్ తో గీసిన వృత్తం మీద ఉన్నరని అంచనా వేయవచ్చు. ఇద్దరు వ్యక్తులూ చెప్పిన సమాచారం ప్రకారం మీ స్థానం రెండు ప్రదేశాలలో ఒకటిగా అంచనా వేయాలి. మరొకతను మీరు కర్నూలుకు 200 కీ.మీ దూరం లో ఉన్నారని చెబితే మీరున్న ప్రదేశం స్పష్టంగా మూడు వృత్తలు కలిసిన చోటు అని తెలిసిపోతుంది.
కానీ ఉపగ్రహాలు, ఎత్తును కూడా పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకే నాలుగు ఉపగ్రహాలు అవసరం.
మన జీ.పీ.యస్ రిసీవర్ కు అది ఒకానొక ఉపగ్రహం నుండి ఇంత దూరం ఉంది అన్న విషయాన్ని ఆ ఉపగ్రహం ఎలా తెలుపుతుంది?
జీ.పీ.యస్ రిసీవర్ కు ఆ ఉపగ్రహం నుండీ సంకేతం కాంతి వేగం తో రావటానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయాన్ని బట్టి దాని దూరం కనుక్కోగలం.
అదండీ జీ.పీ.యస్ సంగతి.