సమాచార సాగరం
దురదగుండాకు?
దురదగుండాకు అనే ఆకు పేరు విన్నారా! లేక తీట కోయిల/ తీట కందిరాకు! పేరేదయినా ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన ప...
వేడి చేయటం?
వేడి చేయటం అంటూ అసలు ఉందా ? ఏ డాక్టర్ ను అడిగిన దీనికి ఒకే సమాదానం . లేదు! మరి మనం ఇంతగా ... "నాకు వేడి చేసిందని" ," నాది వేడి శరీరమని" , వేడి చేసే ఆహారాలు , చలు...
క్యాలెండర్?
నిజానికి క్యాలెండర్ ఏ ఒకరో కనిపెట్టలేదు. దాదాపు 10000 ఏళ్ళ కిందట నైలు నది పరివహప్రాంతం లో ఈజిప్ట్ నాగరికత ఉచ్చ స్థాయి కి చేరుకొన్నది. వారికి నైలు నది...
సూపర్ మూన్ వస్తే?
సూపర్ మూన్! ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది . ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడనే విషయం మీకు తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడూ క్కాస్త దగ...
టూత్ పేస్ట్
మనం రకరకాల టూత్ పేస్ట్ లను వాడుతూవుంటాము. కాని ఏ టూత్ పేస్ట్ వాడలో మాత్రం మనకు అంతగా తెలియదనే చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఒక సర్వే లో  అన్నిటికన్నా ఎక్...
కడుపు నిండా తింటూ కూడా బరువు తగ్గటం?
మీరు కడుపు నిండా తింటూ కూడా లావు మరియు బరువు తగ్గాలనుకుంటున్నారా ?! ఐతే మీరు కొన్ని రకాల ఆహారాన్ని మీ మెనూలో చేర్చుకోండి .పచ్చి  దోర ఆపిల్స్ , కీర దోస ...
చెట్లు – మూఢ నమ్మకాలు
బాగా నీరు ఉన్న చోట ఏపుగా పెరిగే వేప చెట్టుకు బెరడు పగుళ్ళు , ఆ పగుళ్ళలో ఎన్నో రకాల జీవులు, సుక్ష్మ జీవులు , శిలింద్రాలు , చిన్ని కీటకాలు  జీవిస్తూ ఉంటా...
విటమిన్స్ ఎక్కువ అయితే?
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా  పౌష్టికాహారం మీద జరిగిన  ఒక సర్వే లో విటమిన్ల లోపాల మీద కొన్ని విషయాలు తెలిసివచ్చాయి . మధ్యతరగతి మరియు ఉన్నత మధ్యతరగతి , వ...
త్వరగా నిద్ర పట్టాలంటే?
చాల మందికి రాత్రి పడుకొంటూనే ఓ పట్టాన నిద్ర పట్టదు. దీనికి చాల కారణాలు ఉండొచ్చు . కానీ నిద్రపోవటానికి ఒక చిన్న ఉపాయం (కిటుకు) ఉంది. సాదారణంగా మనం పడుక...
ఈగ?
ఈగలు భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసే చెరపు అంతా ఇంతా కాదు. ఎందుకిలా? అసలు ఈగే ఒక మహా చిరాకయినా జీవి. ఈగల  కాళ్ళకు సన్నని వెంట్రుకల వం...

సూపర్ మూన్ వస్తే?

Posted By: Gavesh on April 10, 2011 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, విశ్వం - Comments: 2 Comments »

సూపర్ మూన్! ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది . ఎందుకు? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడనే విషయం మీకు తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడూ క్కాస్త దగ్గరగా కుడా  (అంటే మాములు  కన్నా) వస్తుంటాడు . ఓ  20000 – 30000 km . దీనివలన  ఏమవుతుంది ? నిజానికి  మార్చ్  19 న  మనకు  చందమామ  పైన  చెప్పినట్టుగా అతి దగ్గర  గా  వస్తాడు అని  శాస్త్రవేత్తల నుడివి. కాని  జపాన్  భూకంపం  మార్చ్  12 న సంభవిస్తే  ఏప్రిల్  మొదటి  వరం  లో  ఇండోనేశియ లో భూకంపం  వచ్చింది. ఆఫ్  కోర్స్  ఉత్తర  భారత  దేశం  లో  కూడా! సూపర్ మూన్  కు  ఈ  భూకంపాలకు  ఏమిటి  సంభందం? నిజానికి ఖగోళ  సంభంధమయిన  విషయాలు  కాస్త అటూ ఇటు గా జరుగుతుంటాయి. వాస్తవానికి  చంద్రుడు ఎంత దగ్గరగా వస్తాడో భూమి మీద చంద్రుడి  ఆకర్షణ అంత పెరుగుతుంది. దీని  వలన భూమి  పొరలలో  వత్తిడి  తగ్గి  పోతుంది . చంద్రుడు మాములు కన్నా  20000 కీ.మీ ల  దగ్గర   లో  వున్నాడా  లేక  21000 కీ.మీ ల దగ్గర   లో  వున్నాడా  అనేది  పెద్ద  లెక్క  లోకి  రాదు  . అందువల్లే  కొన్ని  రోజులు  అటు  ఇటుగా  భూకంపాలు  రావటం లేదా అగ్ని పర్వతాలు పేలటం జరుగుతుంటాయి. ఇలా  వత్తిడి పెరగటం లేదా తగ్గటం  వలన  కొన్ని  వేల   చదరపు  కిలో  మీటర్ల  రాతి  పొర   కాస్త  అంటే  కొన్ని  అడుగులు  (జపాన్  విషయం  లో  8 అడుగులు  మాత్రమే ! ) కిందికో , పైకో  ,పక్కకో జరుగుతాయి ! అంతేనండి. ప్రకృతి విలయం. కాబట్టి ఈసారి చంద్రుడు భూమికి దగ్గరగా  వస్తున్నాడంటే  కాస్త జాగ్రత్తండోయ్!!

చంద్రుని చుట్టూ వలయాలు?

Posted By: Gavesh on December 8, 2010 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, విశ్వం - Comments: 1 Comment »

మీరెప్పుడైన అలా మంచి వెన్నెల రాత్రి చంద్రుడి వైపు చూస్తే ఒక్కో సారి చంద్రుడి చుట్టూ ఒక వలయం లేక హలో కనబడుతుంది. ఇలా ఎందుకంటే వాతావరణం లో మంచు స్పటికాలు ఉంటే, అంటే వాతావరణం లో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ మంచు స్పటికాల ద్వార కాంతి  పరివర్తనం మరియు వక్రీభవనం  చెందితే ఇలాంటి పరిస్తితి ఏర్పడుతుంది. ఇలాంటి వలయాలు ఒక రకంగావర్ష సూచన. ఇలా ఏర్పడినప్పుడు వర్షం అక్కడే కానీ లేకే దూరం గా కాని (ఓ 10 లేక 15 కి. మీ. ల అవతల కాని) పడే అవకాసం ఉంది. కాకపోతే వలయం దగ్గర గా ఉంటే వర్షం దూరంగా వలయం దూరం గా ఉంటె వర్షం దగ్గరగా పడుతుందని ఒక నమ్మకం. కాకపొతే సిటీ లలో  ఉన్నవారికి చంద్రుడిని చూసే అవకాశం ఉందంటారా? ఈ సారి రాత్రి  బయటికి వెళ్లేముందు ఒక్కసారి గమనించి బయలుదేరండి.

పాల-పుంతల రకాలు?

Posted By: Gavesh on March 5, 2010 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, విశ్వం - Comments: No Comments »


ఒక్క పాల పుంతలో కొన్ని వందలకోట్ల నక్షత్రాలు ఉంటాయి. మన సూర్యుడు కూడా అలాంటి ఒక నక్షత్రమే. ఈ విశ్యంలో ఇలాంటి పాల పుంతలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి. మానవునికి తెలిసినంతలో ఈ పాల-పుంతల రకాలు నాలుగు.
1. స్పైరల్ : ఒక సుడి లాగా ఉంటాయి. వాటి చుట్టు అవి తిరుగుతూ ఉంటాయి.


2. బార్డ్ స్పైరల్ : పొడవుగా ఉండి, కొనల్లో సుడిలాగా మారుతాయి.


3. ఎలిప్టికల్ : పళ్ళెం లేదా గుడ్డు లేదా బంతి ఆకారంలో ఉంటాయి ఇవి.


4. ఆకారం లేనివి : వీటికి ఒక ఆకారం అంటూ ఉండదు.

భూమి?

Posted By: Gavesh on January 26, 2010 in ఎందుకు? ఏమిటీ? ఎలా?, విశ్వం - Comments: 2 Comments »

భూమిభూమి వయస్సు ఎంత?

మండిపోతున్న వాయువూ, ధూళీ నుండి దాదాపుగా 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. అతి పురాతన రాయి యొక్క వయస్సు 380 కోట్ల సంవత్సరాలు. భూమి ఏర్పడుతున్న సమయంలో పడ్డ ఉల్కలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూమి ఏ ఆకారంలో ఉంది?

భూమి గోలాకారంలో లేదు. ఎందుకంటే అది తిరిగే వేగానికి భూమధ్యరేఖ దగ్గర కాస్త ఉబ్బి ఉంది. ఈ ఆకారాన్ని ‘జియోయిడ్’ అని పిలుస్తారు.

భూమి అడ్డుకొలత : భూమధ్యరేఖ వద్ద కొలత 12,757 కీ.మీ. కానీ రెండు దృవాల మధ్య కొలత భూమధ్యరేఖ వద్ద కొలత కన్నా 43 కీ.మీ తక్కువ ఉంటుంది.

భూమి చుట్టు కొలత : ఉపగ్రహాల సాయంతో తెలిసిన చుట్టు కొలత 40,075 కీ.మీ

భూమి బరువు : 5,973,600,000,000,000,000,000,000 కిలోలు. ఏమీ లేదండీ, దాదాపు 6 పక్కన 24 సున్నాలు పెట్టినన్ని కిలోలు.

భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయాన్ని ఒక రోజు అంటాం. కానీ ఈ సమయం సరిగా ఎంత? 23 గంటలా 56 నిమిషాలా 4.09 క్షణాలు.

సూర్యుని చుట్టూ భూమి తిరగటానికి పట్టే సమయం ఒక సంవత్సరం. ఇది సరిగ్గా 365.24 రోజులు. ఈ 0.24 రోజును నాలుగు సంవత్సరాలకు ఒక సారి కలిపి ఫిబ్రవరీ 29 వస్తుంది. భూమి తిరిగే ఈ దురం 938,886,400 కీ.మీ.